BJP : దక్షిణ తెలంగాణపై బీజేపీ ఫోకస్.. నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ పోటీ చేస్తారా?-bjp focus on south telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp : దక్షిణ తెలంగాణపై బీజేపీ ఫోకస్.. నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ పోటీ చేస్తారా?

BJP : దక్షిణ తెలంగాణపై బీజేపీ ఫోకస్.. నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ పోటీ చేస్తారా?

Anand Sai HT Telugu
Jul 24, 2022 02:52 PM IST

అమిత్ షాతో సమావేశమైతే.. కచ్చితంగా అందులో అంతరార్థం ఉంటుంది. పైకి చెప్పే మర్యాదపూర్వక భేటీలు.. పక్కన పెడితే కనిపించని లెక్కలు చాలా ఉంటాయనేది.. బహిరంగ రహస్యం. అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మీటింగ్ తో బీజేపీలో చేరికలపై పెద్ద ఎత్తున ప్రచారం మెుదలైంది. అసలు బీజేపీకి ప్రస్తుత టార్గెట్ ఏంటీ?

దక్షిణ తెలంగాణపై బీజేపీ ఫోకస్
దక్షిణ తెలంగాణపై బీజేపీ ఫోకస్

మెున్నటికిమెన్న.. అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భేటీ అయ్యారు. ఎప్పటి నుంచో.. రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీలో నుంచి.. బయటకు వస్తారనే.. ప్రచారం ఉంది. ఈ సమావేశం కాస్త.. ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే వీరిద్దరి భేటీలో ఓన్లీ.. రాజగోపాలరెడ్డి చేరికపైనే చర్చ జరిగిందా? అంటే.. అది మాత్రం అస్సలు బయటకు రాదు. అమిత్ షా ప్లానింగ్.. అలా ఉంటుంది మరి. ఉత్తర తెలంగాణలో ఎంతో కొంత ఊపు ఉందనే ఆలోచనలో బీజీపీ ఉంది. మరి నెక్ట్స్ ఏంటి? దక్షిణ తెలంగాణ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది.

అమిత్ షా పలకరిస్తే ఓ లెక్క.. ఆలింగనం చేసుకుంటే మరో లెక్క.. కరచాలనం చేస్తే.. ఏదో ప్లాన్.. అలాంటిది ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో.. గంటకుపైగా భేటీ అయ్యాడంటే.. అది మార్యాదపూర్వక భేటీ అని ఎవరూ నమ్మరు. కాంగ్రెస్ లో ఉక్కపోతతో.. ఎప్పటి నుంచో.. కోమటిరెడ్డి చిరాకుగానే ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు బయటకు వస్తారో.. అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అలాంటిది.. సడెన్ గా అమిత్ షాతో భేటీతో.. చెప్పకనే అందరికీ క్లారిటీగా చెప్పినట్టైంది.

టీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలంటే.. ఉత్తర తెలంగాణ మాత్రమే సరిపోదు కదా. అందుకే దక్షిణ తెలంగాణపైనా.. బీజేపీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో.. ఇతర పార్టీల నుంచి జంపయ్యే.. బలమైన నేతలకు బీజేపీ గాలం వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అసమ్మతి నేతలపై గురి పెట్టినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ తెలంగాణలోని ఆ అసమ్మతి నేతలకు కాషాయం కండువా కప్పి.. ఎలాగైనా.. బలపడాలనే.. ఆలోచనలో బీజేపీ ఉంది.

ఇప్పటికే రంగారెడ్డి నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి.. ఆలోచించి.. ఆలోచించి.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కాషాయం కండువా కప్పుకున్నారు. ఇక మెల్లమెల్లగా.. దక్షిణ తెలంగాణ నుంచి వచ్చే బలమైన వలసవాదులను పార్టీలో చేర్చుకుని.. బలపడాలని బీజేపీ అనుకుంటోంది. ఇప్పటికే.. కొంతమంది తమతో టచ్ లో ఉన్నట్టుగా తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో బలమైన నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. కాషాయం కండువా కప్పుకుంటారని ఖాయమైపోయినట్టుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఖమ్మం-పొంగులేటి, మహబూబ్‌నగర్‌-జూపల్లిలాంటి నేతలు సైతం.. వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. నిజమో కాదో.. తెలియాలంటే.. ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

అయితే దక్షిణ తెలంగాణలోని బలమైన నేతల లిస్ట్.. బీజేపీ తయారు చేసినట్టుగా తెలుస్తోంది. వారిని పార్టీలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వారంతా పార్టీలో చేరితే.. ఇప్పటి నుంచే.. ఉత్తర, దక్షిణ తెలంగాణలో పార్టీ యాక్టివిటీని పెంచాలని.. టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలనే.. బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలే ప్రకటించిన ఆరా సంస్థ సర్వేలో బీజేపీకి 30 శాతంపైగా.. ఓట్లు వస్తాయని వచ్చింది. దీంతో ఇంకాస్త గట్టిగా కష్టపడితే.. అధికారంలోకి రావొచ్చని బీజేపీ హైకమాండ్.. అనుకుంటోంది. లిస్ట్ లోని నేతలతో.. సంప్రదింపులు జరిపి.. ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని .. బీజేపీ అనుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్?

ఇప్పుడు మారో చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ చర్చ గతంలోనూ నడిచింది. తాను చేయాలనుకునే విషయాన్ని ముందుగా.. జనాల్లో చర్చ నడిచేలా చేస్తారు కేసీఆర్. అది ఆయన స్టైల్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుంచి ఆయన పోటీ చేస్తారని ఈ ఏడాది మెుదటి నుంచి ప్రచారం జరుగుతుంది. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని.. అక్కడ నుంచి పోటీ చేసేందుకు చూస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మంత్రి జగదీశ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డితో గతంలోనూ మాట్లాడినట్టుగా ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ మారుతున్న ప్రచారంతో గులాబీ బాస్ వేగం పెంచారు. ఆరు నెలల క్రితం జరిగిన పార్టీ సమావేశంలోనూ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయనని కేసీఆర్ సిగ్నల్ ఇచ్చారు. నల్గొండ జిల్లా నుంచే పోటీ చేయనున్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ పోటీ చేస్తే.. దక్షిణ తెలంగాణలోని మిగతా జిల్లాలపైనా.. ప్రభావం పడుతుందనే ఆలోచనలో ఉన్నారేమో. అయితే దీనిపై మాత్రం స్పష్టత లేదు. ఏం జరుగుతుందో.. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం