Rains in India : రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు
Rains in India : రానున్న మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఆ వివరాలు..
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు..! (ANI)
Rains in India : దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది. సోమ- మంగళవారాల్లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. కర్ణాటక, గోవా, కేరళలో రానున్న రోజుల పాటు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఈశాన్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తుపానుగా మారే అవకాశం ఉంది! ప్రస్తుతం అది ఓమన్వైపు గంటకు 50కి.మీల వేగంతో ప్రయాణిస్తోంది.
- సోమవారం నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో, మంగళవారం నుంచి పశ్చిమ్ బెంగల్ హిమాలయ ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి.
- జులై 20న హిమాచల్‌ప్రదేశ్‌లో, జులై 19-21 మధ్యలో ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
- పంజాబ్, హరియాణా, ఛండీగఢ్-ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి.
- పశ్చిమ రాజస్థాన్‌లో ఆదివారం నుంచి, తూర్పు రాజస్థాన్‌లో 20 వరకు అక్కడక్కడా తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయి.
- మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో 17-21 మధ్యలో, కర్ణాట తీర ప్రాంతం 18-19, కోంకణ్ ప్రాంతం- గోవాలో 18 వరకు, కేరళ-మాహేలో 20 వరకు అక్కడక్కడా వర్షాలు పడతాయి.
- ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని ఉత్తర భాగం, యానామంలో ఆదివారం వర్షాలు కురిశాయి. గుజరాత్, మారాఠావాడా, తెలంగాణలో సోమవారం, తమిళనాడులో ఈనెల 19వరకు, మహారాష్ట్రలో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
సంబంధిత కథనం