CM KCR : వర్షంలోనే కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతిపూజ-cm kcr visit flood affected areas in warangal and bhadrachalam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : వర్షంలోనే కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతిపూజ

CM KCR : వర్షంలోనే కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతిపూజ

HT Telugu Desk HT Telugu
Jul 17, 2022 01:38 PM IST

వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు.

<p>గోదావరి నదికి కేసీఆర్ పూజ&nbsp;</p>
గోదావరి నదికి కేసీఆర్ పూజ

గోదావరి నది వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు శనివారం వరంగల్ చేరుకున్నారు. ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దు చేశారు. దీంతో బాధిత ప్రజలకు చేరుకునేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు సీఎం. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ పయానం.. కొనసాగుతోంది.

కేసీఆర్ తో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల బృందం భద్రాచలంలో పర్యటిస్తోంది. అక్కడ ముంపునకు గురైన ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలుస్తున్నారు. వర్షంలోనే వరద ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటిస్తున్నారు.

భద్రాచలంలో గోదావరి వరద ముంపు పరిస్థితిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. గోదావరి నదికి సీఎం కేసీఆర్ శాంతి పూజ చేశారు. గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలించారు. వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడుతారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలపై చర్చిస్తారు. వరద పరిస్థితికి సంబంధించి చేపట్టిన సహాయ కార్యక్రమాలు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు.

సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మిత సబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్ సీ మురళీధర్ రావు, తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.

Whats_app_banner