Rain Alert : ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించారు. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరబాద్‌లో మరోమారు భారీ వర్షాలు కురువనున్నాయి. భాగ్యనగరంతో పాటు పొరుగున ఉన్న మూడు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో జిహెచ్‌ఎంసి పరిధిలోని ప్రాంతాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గురువారం సాయంత్రం గ్రేటర్‌లోని పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నాయని అంచనా వేస్తోంది. గురువారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో అయా జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రుతుపవనాల ప్రభావానికి తోడు ఉపరితల ద్రోణి తెలంగాణపై కొనసాగుతుండడంతో ఈ నెల ఎనిమిది వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
శనివారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
ఆంధ్రాలోను వర్షాలు….
అటు ఏపీలో కూడా శుక్రవారం విస్తారంగా వానలు పడతాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్నూల్, నంద్యాల, అనంతపూర్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోత పడొచ్చని పేర్కొంది. వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.
టాపిక్