తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Prakasam Crime : వదినా మరిది మధ్య వివాహేతర సంబంధం, ఇంట్లో తెలియడంతో రైలు కిందపడి ఆత్మహత్య

Prakasam Crime : వదినా మరిది మధ్య వివాహేతర సంబంధం, ఇంట్లో తెలియడంతో రైలు కిందపడి ఆత్మహత్య

23 May 2023, 18:29 IST

    • Prakasam Crime : వివాహేతర సంబంధం మరో రెండు ప్రాణాలు తీసింది. వదినామరిదిల మధ్య వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో గొడవలు జరిగాయి. దీంతో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వదినా, మరిది సూసైడ్
వదినా, మరిది సూసైడ్

వదినా, మరిది సూసైడ్

Prakasam Crime : వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలు దారితీస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇటీవలే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్యపై అనుమానంతో అతిదారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. తమ వివాహేతర ఇంట్లో తెలిసి గొడవ జరగడంతో వదిన, మరిది రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(30), రాములమ్మ(27) వరసకు వదినా మరిదిలు అవుతారు. కొంతకాలంగా వీరిద్దరూ వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

ఇంట్లో తెలిసిపోవడంతో

వదినా మరిదిల సంబంధం కుటుంబ సభ్యుల తెలియడంతో సోమవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో ఇద్దరు బైక్ పై బయటకు వెళ్లిపోయారు. అనంతరం సైదాపురం వద్ద రైల్వే ట్రాక్‌పై తలపెట్టి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసులుకు రెండేళ్ల క్రితం వివాహం జరగగా, రాములమ్మకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

జంట హత్యలు చేసి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనసకు చెందిన వివాహితకు అదే గ్రామానికి చెందిన అవివాహితుడైన ముద్దాడ రామారావుతో గత కొంత కాలంగా పరిచయం ఉంది. ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం నడిచింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ముద్దాడ సంతోష్‌ కుమార్‌తో ఎర్రమ్మకు సంబంధం ఏర్పడిందని రామారావుకు అనుమానం పెంచుకున్నాడు. అందుకే ఎర్రమ్మ తనను పక్కన పెడుతుందనే అనుమానంతో రామారావు.. ఎర్రమ్మను, సంతోష్‌కుమార్‌ను కత్తితో నరికి చంపేశాడు. గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలవలో సంతోష్‌ కుమార్‌ స్నానం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లిన రామారావు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అదే కత్తి తీసుకుని అర కిలోమీటరు దూరం వాహనంపై ప్రయాణించి పెసర పొలంలో కలుపు తీస్తున్న ఎర్రమ్మను నరికి చంపి పరారయ్యాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

జంట హత్యలతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఈ హత్యలకు పాల్పడింది రామారావు అని తెలియడంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. అయితే ఊరి శివార్లలోని రామారావు మృతదేహాన్ని గుర్తించారు. హత్య చేసిన తర్వాత పొలాల్లో గొంతు కోసుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం మూడు నిండు ప్రాణాలు బలి తీసుకోవడంతో గ్రామంలో విషాదం అలముకుంది.