తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan Pithapuram Schedule : పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు, ఈ నెల 30 నుంచి ప్రచారం స్టార్ట్

Pawan Kalyan Pithapuram Schedule : పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు, ఈ నెల 30 నుంచి ప్రచారం స్టార్ట్

25 March 2024, 21:40 IST

google News
    • Pawan Kalyan Pithapuram Schedule : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు.
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Pawan Kalyan Pithapuram Schedule : ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి పార్టీలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 27 నుంచి వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇక పిఠాపురంలో నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan Pithapuram Schedule) పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30 నుంచి పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇప్పటికే వారాహి వాహనాన్ని పిఠాపురం నియోజకవర్గానికి తరలించారు. ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మార్చి 30న నియోజకవర్గంలో కూటమి నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం శ్రీపాద వల్లభుడుని దర్శించుకుంటారు. 31వ తేదీన ఉప్పాడ సెంటర్ లో వారాహి యాత్ర(Varahi Yatra)లో భాగంగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఏప్రిల్ 1న జనసేనలో చేరికలు, నియోజకవర్గంలోని మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మూడు రోజులు పవన్ కల్యాణ్ పిఠాపురంలోనే బస చేయనున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో కూటమి నేతల ఇళ్లకు వెళ్లనున్నారు.

వర్మ మద్దతుతో

రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గం పేరు మారుమోగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఆమె కూడా కాపు సామాజికవర్గం(Kapu) నేత కావడంతో తమకు లాభిస్తోందని వైసీపీ అంచనా వేస్తుంది. మరోపక్క కాపు ఉద్యమ నేత, ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభంకు వైసీపీ అధిష్టానం పిఠాపురం(Pithapuram) బాధ్యతలు అప్పగించింది. దీంతో ముద్రగడ పిఠాపురంలో కాపునేతలు వరుసగా సమావేశం అవతున్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఓటమి కోసమే తాను పనిచేస్తానని ముద్రగడ ప్రకటనలు చేస్తున్నారు. గత కొన్ని రోజులు టికెట్ రాలేదని అసంతృప్తిగా ఉన్న టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మ(TDP SVSN Varama) పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆదివారం వర్మ మంగళగిరి జనసేన (Janasena)కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలుపించుకుంటామని మరోసారి వర్మ స్పష్టం చేశారు. వైసీపీ ఎత్తుగడలకు సరైన వ్యూహాలతో చెక్ పెట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అసంతృప్తి నేతలతో మాట్లాడుతూ తన విజయానికి సహకరించాలని కోరుతున్నారు.

పీపుల్స్ పల్స్ సర్వే

ప్రముఖ సర్వే సంస్థ పీపుల్స్ పల్స్(People Pulse Survey) పిఠాపురంలో (Pithapuram)మార్చి 18 నుంచి 21 వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పిఠాపురంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. పిఠాపురంలో కాపుల(Kapu Voting)తో పాటు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇతర కులాల ఓటర్ల అభిప్రాయం సేకరించినట్లు పీపుల్స్ ప్రకటించింది. ఈ సర్వేలో వైసీపీకి 32.7 శాతం ఓట్లు వస్తుండగా, కూటమి తరఫున పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు 60.3 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమికి 3.3 శాతం ఓట్లు, ఇతరులకు 3.7 శాతం ఓట్లు వస్తున్నాయి తెలిపింది. పిఠాపురంలో 62 శాతం పురుషులు, 57 మహిళలు జనసేన అభ్యర్థికి మద్దతు తెలిపారు. 30 శాతం పురుషులు, 35 శాతం మహిళలు వైసీపీని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అభ్యర్థికి నియోజకవర్గంలో ఎక్కువ మద్దతు ఉన్నట్లు తాజా సర్వేలో తెలిసినట్లు పీపుల్స్ పల్స్ వెల్లడించింది.

తదుపరి వ్యాసం