Pithapuram Politics: పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్ పోటీ.. రసవత్తరంగా మారిన గోదావరి జిల్లా రాజకీయం-pawan kalyans contest in pithapuram godavari district politics has become interesting ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pithapuram Politics: పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్ పోటీ.. రసవత్తరంగా మారిన గోదావరి జిల్లా రాజకీయం

Pithapuram Politics: పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్ పోటీ.. రసవత్తరంగా మారిన గోదావరి జిల్లా రాజకీయం

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 11:18 AM IST

Pithapuram Politics: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పోటీతో పిఠాపురం రాజకీయాలు వేడెక్కాయి. సిట్టింగ్‌ నియోజక వర్గాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, అసెంబ్లీలో అడుగు పెట్టాలని జనసేనాని.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

పిఠాపురంలో పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్
పిఠాపురంలో పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్

Pithapuram Politics: ఏపీలో ఆసక్తికరమైన రాజకీయాలకు పిఠాపురం వేదికగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నియోజక వర్గాల్లో ఒకటైన పిఠాపురంలో ఈసారి జనసేన అధ్యక్షుడు PawanKalyan పవన్ కళ్యాణ్‌ Elections పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా భీమవరం నుంచి పోటీ చేయాలని భావించినా చివరకు పిఠాపురంకు మొగ్గు చూపారు.

రాష్ట్రంలో కాపులకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాల్లో పిఠాపురం Pithapuram కూడా ఒకటి. 2024 ఎన్నికల జాబితా లెక్కల ప్రకారం పిఠాపురంలో ప్రస్తుతం 2,31,624 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,15,974మంది పురుషులు, 1,15,647 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

పిఠాపురంలో ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు 32శాతం కాపు Kapuలు ఉంటారని అంచనా. 90వేలకు పైగా ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గు చూపారు. 1960 నుంచి జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు మాత్రమే ఇతర సామాజిక వర్గాల నాయకులు ఇక్కడ ఎన్నికయ్యారు.

1960 ఉప ఎన్నికల్లో పేకేటి తమ్మిరాజు, 62లో రావు భావన్న(వెలమ), 67, 72లో యాళ్ల సత్యనారాయణ మూర్తి, 78,89లో కొప్పన వెంకటమోహనరావు, 83, 85, 94లో వెన్నా నాగేశ్వరరావు, 99లో సంగిశెట్టి వీరభద్రరావు, 2004లో పెండెం దొరబాబు, 2009లో వంగాగీత, 2014లో ఎస్‌విఎన్‌ఎస్ వర్మ, 2019లో వైసీపీ తరపున దొరబాబు గెలిచారు.

1962లో రావు భావన్న తర్వాత 2014లో వర్మ ఇండిపెండెంట్‌గా గెలిచారు. మిగిలిన అన్ని ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వారే పిఠాపురం నుంచి గెలుపొందుతూ వచ్చారు. నియోజక వర్గంలో కాపుల తర్వాత బలమైన సామాజిక వర్గంగా ఉన్న శెట్టి బలిజలు 9.78శాతం ఉన్నారు.

తర్వాత స్థానంలో మాల, మత్స్యకార, పద్మశాలి సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. రెడ్డి, యాదవ,కొప్పుల వెలమ, మాదిగ, తూర్పు కాపులు ఒక్కో కులం సగటున 3.5శాతం జనాభా ఉన్నారు పిఠాపురంలో మొత్తం 12సార్లు కాపులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వెలమలు రెండుసార్లు గెలిచారు. బ్రహ్మణలు ఓసారి,క్షత్రియ అభ్యర్థి ఓసారి గెలిచాడు.

పవన్‌కు కాపు కాస్తారా…?

టీడీపీ-జనసేన కూటమిలో Alliance భాగంగా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్‌కు వదలడానికి వర్మ చివరి వరకు ఒప్పుకోలేదు. Chandrababu చంద్రబాబు బుజ్జగింపుతో దారికి వచ్చినా పవన్ లోక్‌సభకు పోటీ చేస్తే తనకే అవకాశం ఇవ్వాలని మెలిక పెట్టాడు. మరోవైపు జనసేన, టీడీపీ కూటమిలో సీట్ల సర్దుబాటులో అవకాశం దక్కని వారంతా పార్టీని విడిచి పెడుతున్నారు.

బుధవారం పిఠాపురంకు చెందిన జనసేన నాయకురాలు మాకినీడి శేషుకుమారి సిఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికలలో పిఠాపురం జనసేన అభ్యర్ధిగా పోటీచేసి 28 వేల‌ ఓట్లు సాధించిన శేషుకుమారి వైసీపీ గూటికి చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన వంగా గీత ప్రస్తుతం వైసీపీ పిఠాపురం అభ్యర్థిగా ఉన్నారు.

పిఠాపురం నియోజక వర్గంలో గెలుపు కోసం వంగా గీతను బరిలోకి దింపిన వైసీపీ కాపు నాయకుల్ని అక్కడ మొహరిస్తోంది. ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య కుమారుడిని ఇప్పటికే పార్టీలో చేర్చుకుంది. పిఠాపురం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో పిఠాపురం ఓటర్లు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు అండగా నిలుస్తారా, వైసీపీ వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం