(1 / 6)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(AP Election Schedule) విడుదల కావడంతో వైసీపీ ప్రచారానికి సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్(CM jagan) మేం సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు.
(2 / 6)
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఈనెల 27 నుంచి మేం సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సుయాత్ర(CM Jagan Bus Yatra) నిర్వహించనున్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. 21 రోజులపాటు ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సీఎం మమేకం కానున్నారన్నారు.
(3 / 6)
ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాల్లో కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
(4 / 6)
బస్సు యాత్ర మొదటి మూడు రోజుల షెడ్యూల్ వైసీపీ విడుదల చేసింది. ఈ నెల 27న ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళి అర్పించి బస్సు యాత్ర ప్రారంభిస్తారు.
(5 / 6)
సీఎం జగన్ బస్సు యాత్రలో ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్, సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
(6 / 6)
ఈ నెల 27న ప్రొద్దుటూరులో సీఎం జగన్ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. 28న నంద్యాలలో ఉదయం బస్సు యాత్ర, సాయంత్రం సభ నిర్వహిస్తారు. మార్చి 30న ఎమ్మిగనూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఇతర గ్యాలరీలు