
(1 / 5)
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ(TDP) నాయకులు సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ఈ సమావేశం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది.

(2 / 5)
పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను పవన్ కల్యాణ్ కు టీడీపీ నేతలు వివరించారు. అక్కడ కచ్చితంగా పవన్ కల్యాణ్ ను భారీ ఆధిక్యంతో గెలిపించుకొంటామని వారిద్దరూ స్పష్టం చేశారు.

(3 / 5)
త్వరలో తన ప్రచారం పిఠాపురం నుంచే ప్రారంభిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. తొలుత పురుహూతికదేవి ఆలయంలో పూజలు చేసి, శ్రీ దత్త పీఠాన్ని దర్శించుకొంటానని తెలిపారు. టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మ ఇంటికి వెళ్లిన తరవాత పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నాయకులతోనూ సమావేశమవుతానన్నారు.

(4 / 5)
పిఠాపురం(Pithapuram) నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్‌ఎన్ వర్మ(SVSN Varma) చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ఇద్దరు నేతలు పవన్ కల్యాణ్ కు వివరించారు.

(5 / 5)
పవన్ కల్యాణ్ ను(Pawan Kalyan) ను భారీ ఆధిక్యంతో గెలిపించుకొంటామని టీడీపీ నేతలు వర్మ, సుజయ కృష్ణ రంగారావు తెలిపారు. మూడు పార్టీలు సమన్వయంతో కలసి పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వారికి వెల్లడించారు.
ఇతర గ్యాలరీలు