తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Svims : డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుతో పాటు ఫెలోషిప్‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ - ఇవిగో వివరాలు

Tirupati SVIMS : డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుతో పాటు ఫెలోషిప్‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ - ఇవిగో వివరాలు

HT Telugu Desk HT Telugu

18 July 2024, 18:00 IST

google News
    • Tirupati SVIMS : తిరుప‌తిలోని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (స్విమ్స్‌) యూనివ‌ర్శిటీ వైరాల‌జీ విభాగంలో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టు, అలాగే రెండు ఫెలోషిప్‌ భ‌ర్తీకి నోటీఫికేష‌న్ విడుద‌లైంది.
తిరుపతి స్విమ్స్ లో ఉద్యోగాలు
తిరుపతి స్విమ్స్ లో ఉద్యోగాలు

తిరుపతి స్విమ్స్ లో ఉద్యోగాలు

స్విమ్స్‌ యూనివ‌ర్శిటీ వైరాల‌జీ విభాగం (పీఐ-ఐసీఎంఆర్‌-డీహెచ్ఆర్‌-వీఆర్‌డీఎల్ ప్రాజెక్టు)లో కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. ఆస‌క్తి ఉన్న అర్హ‌త గల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుపూర్తి చేసి అన్ని ఓరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీల‌తో స‌హా తీసుకుని జులై 20న హాజ‌రుకావాల‌ని యూనివ‌ర్శిటీ రిజిస్ట్రార్ కోరారు.

జులై 20 (శ‌నివారం)న స్వీమ్స్ క‌మిటీ హాల్‌లో ఉద‌యం 8 గంట‌ల‌కు స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్‌, ఆ తరువాత ఉద‌యం 9 గంట‌ల‌కు ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ఈ పోస్టు ఏడాది పాటు ఉంటుంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి పొడిగిస్తారు. ద‌ర‌ఖాస్తును యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్‌ https://svimstpt.ap.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనికి అర్హ‌త ఏదైనా డిగ్రీ అలాగే డేటా ఎంట్రీలో ప‌రిజ్ఞానం ఉండాలి. వ‌యో ప‌రిమితి 35 ఏళ్లు.

ఎన్‌సీ గుప్తా పల్మనరీ ఫెలో

ఎన్‌సీ గుప్తా ప‌ల్మ‌న‌రీ ఫెలోషిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆగ‌స్టు 8 వ‌ర‌కు గ‌డువు నిర్ణ‌యించారు. ఆగ‌స్టు 18న అప్లికేష‌న్లు ప‌రిశీలిస్తారు. ఆ త‌రువాత కౌన్సింగ్ నిర్వ‌హిస్తారు. ఎటువంటి అప్లికేష‌న్ ఫీజు లేదు. ఈ ఫెలోషిప్‌కి ఎంపికైన వారికి ఆరు నెల‌ల పాటు ట్రైనింగ్ ఉంటుంది. అందులో నాలుగు వారాల పాటు దేశంలోని ఏక్క‌డైనా, విదేశాల్లోనైనా ట్రైనింగ్ ఇస్తారు. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దీనికి అర్హ‌త‌లు ఎండీ, డీఎన్‌బీ (మెడిస‌న్‌, జ‌న‌ర‌ల్ మెడిస‌న్‌, ఇంట‌ర్న‌న‌ల్ మెడిస‌న్‌), ఎంటీ (డీబీ అండ్ ఆర్‌డీ), డీఎన్‌బీ (శ్వాసకోశ వ్యాధులు), డీటీసీడీ, డీఎం (ప‌ల్మోనాలజీ) చేసి ఉండాలి. ఏడాదికి ఇద్ద‌రిని మాత్ర‌మే ఎంపిక చేస్తారు. వ‌యో ప‌రిమితి 45 ఏళ్ల మించ‌కూడ‌దు. కోర్సుకు ఎటువంటి ఫీజు ఉండ‌దు. ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే అభ్య‌ర్థులు యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://svimstpt.ap.nic.in నుంచి అప్లికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫెలోషిప్‌కి ఎంపికైన వారికి స్టైఫండ్‌తో పాటు వ‌స‌తి కూడా క‌ల్పిస్తారు.

అప్లికేష‌న్‌కు ఎస్ఎస్‌సీ మార్కుల జాబితా, పుట్టిన తేదీ కోసం ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికేట్‌, ఎంబీబీఎస్ డిగ్రీ స‌ర్టిఫికేట్‌, ఇంటేర్న‌షిప్ స‌ర్టిఫికేట్‌, పీజీ డిగ్రీ ప్రొవిజిన‌ల్, ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్‌, డీటీసీడీ స‌ర్టిఫికేట్‌, యూజీ, పీజీ స్ట‌డీ స‌ర్టిఫికేట్‌, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ మెడిక‌ల్ కౌన్సిల్ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్, డీఎం ప‌ల్మోనాల‌జీ స‌ర్టిఫికేట్ జ‌త చేయాల్సి ఉంటుంది. ఈ "ఎన్‌సీ గుప్తా పల్మనరీ ఫెలో" ఉద్దేశ్యం పల్మోనాలజీలో వైద్యులకు అధునాతన శిక్షణను అందించడంతో పాటు పల్మనరీ మెడిసిన్‌కి సంబంధించిన పరిశోధనలో బోధనలో నైపుణ్యం, మరింత జ్ఞానాన్ని ప్రోత్సహించడం.

64 శాతం పాలిటెక్నిక్ సీట్లు ఖాళీ

రాష్ట్రంలో మొత్తం 161 పాలిటెక్నిక్ కాలేజీలుండ‌గా, అందులో ప్ర‌భుత్వ 84 కాలేజీలు, ప్రైవేట్ 176 కాలేజీలు ఉన్నాయి. ఒక ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. అయితే 261 పాలిటెక్నిక్ కాలేజీల్లో 81,420 సీట్లు ఉండ‌గా, అందులో 37,036 (46 శాతం) సీట్లు మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయి. అంటే స‌గానికి ఎక్కువ సీట్లు భ‌ర్తీ కాలేదు. మొత్తం కాలేజీల్లో 44,384 (54 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఇందులో 85 ప్ర‌భుత్వ, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో 17,943 సీట్లు ఉండ‌గా, అందులో 11,042 సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ఇంకా 6,901 సీట్లు ప్రభుత్వ‌, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలి ఉన్నాయి. 176 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 63,477 సీట్లు ఉండ‌గా, అందులో 25,994 సీట్లు భ‌ర్తీ అయ్యాయి. అంటే ఇంకా 37,483 సీట్లు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో భ‌ర్తీ కాకుండా మిలిగిపోయాయి.

అలాగే సాధార‌ణ కౌన్సిలింగ్ పూర్తి అవ్వ‌డంతో స్పాట్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. రెగ్యుల‌ర్ కౌన్సిలింగ్ ప్ర‌క్రియ పూర్తి అయితే, మిగిలిపోయిన సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌డానికి స్పాట్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు. అర్హ‌త గ‌ల విద్యార్థులు పాల్గొని కళాశాల‌ల్లో అందుబాటులో ఉన్న సీట్ల‌లో అడ్మిష‌న్ పొందేందుకు ఈ రౌండ్‌లో అవ‌కాశం ఉంటుంది.

2024-25 విద్యా సంవ‌త్సరానికి పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ పాలీసెట్-2024 ఏప్రిల్ 27న జ‌రిగింది. 1,59,989 మంది విద్యార్థులు పాలీసెట్‌కు అప్లై చేయ‌గా, 1,41,978 (88.74) ప‌రీక్ష‌లు రాశారు. కౌన్సిలింగ్ పూర్తి అవ్వ‌గా 37,036 మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌లో చేరారు.

జులై 11 నుంచి పాలిటెక్నిక్ రెండో ద‌శ కౌన్సింగ్ ప్రారంభం అయింది. జులై 11 నుంచి 13 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లింపులు, స‌ర్టిఫికేట్ల ప‌రిశీల‌న చేప‌ట్టారు. 11 నుంచి 14 వ‌ర‌కు ఆప్ష‌న్ ఎంట్రీ, 16న సీట్లు కేటాయింపు చేశారు. జులై 18 నుంచి 20 వ‌ర‌కు సీట్లు పొందిన వారు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయ‌నున్నారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం