NG Ranga Courses : ఎన్‌జీ రంగా వ‌ర్సిటీ ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం, డైరెక్ట్ లింక్ ఇదే-guntur ng ranga agriculture courses nri quota seat applications invited ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ng Ranga Courses : ఎన్‌జీ రంగా వ‌ర్సిటీ ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం, డైరెక్ట్ లింక్ ఇదే

NG Ranga Courses : ఎన్‌జీ రంగా వ‌ర్సిటీ ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం, డైరెక్ట్ లింక్ ఇదే

HT Telugu Desk HT Telugu
Jul 03, 2024 10:54 PM IST

NG Ranga Agriculture Courses : ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో వ్యవసాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జులై 4 నుంచి యూనివ‌ర్సిటీ అధికార వెబ్‌సైట్ https://angrau.ac.in/ లో ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

ఎన్‌జీ రంగా వ‌ర్సిటీ ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం
ఎన్‌జీ రంగా వ‌ర్సిటీ ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

NG Ranga Agriculture Courses : ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవ‌సాయ‌ యూనివ‌ర్సిటీ వ్యవ‌సాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆ యూనివ‌ర్సిటీ ఆహ్వానిస్తుంది. 2024-25 విద్యా సంవ‌త్సరానికి గానూ అగ్రక‌ల్చర్ బీఎస్సీ చేసేందుకు ఈ ద‌రఖాస్తులు ఆహ్వానిస్తుంది. అగ్రిక‌ల్చర‌ల్‌, అగ్రిక‌ల్చర‌ల్ ఇంజినీరింగ్‌, ఫుడ్ టెక్నాల‌జీ, కమ్యూనిటీ సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవ‌సాయ‌ యూనివ‌ర్సిటీ పరిధిలోని క‌ళాశాల్లో 2024-25 విద్యా సంవ‌త్సరానికి అడ్మిష‌న్లలో ఎన్ఆర్ఐ కోటా కింద కొన్ని సీట్లను అందుబాటులో ఉన్నాయి. వీటికి ద‌ర‌ఖాస్తుల‌ను యూనివ‌ర్సిటీ ఆహ్వానిస్తుంది. జులై 4 నుంచి యూనివ‌ర్సిటీ అధికార వెబ్‌సైట్ https://angrau.ac.in/ లో ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అప్లికేషన్ దాఖ‌లు చేసేందుకు 17 ఏళ్లు పూర్తి అయి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలి?

ద‌ర‌ఖాస్తు ఆఫ్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. యూనివ‌ర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://angrau.ac.in/UPLOADS/EventsPDFs/NRI%20Application%20with%20Brochure%2024-25.pdf ను క్లిక్ చేస్తే అప్లికేష‌న్‌ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. అప్లికేష‌న్‌లో అడిగిన స‌మాచారాన్ని పూర్తి చేయాలి.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు రూ.2,000 ఉంటుంది. దీనిని యూనివ‌ర్సిటీ అకౌంట్‌కి ఆన్‌లైన్ ద్వారా, లేక డీడీ రూపంలో ఆఫ్‌లైన్‌లోనై చెల్లించొచ్చు. అలాగే ప్రొసెసింగ్ ఫీజు రూ.4,420 ఉంటుంది. ట్యూష‌న్ ఫీజు రూ.8,050, హాస్ట‌ల్ డిపాజిట్ రూ.8,050, మెస్ అడ్వాన్స్ రూ.8,050, హాస్ట‌ల్ ఎస్టాబ్లిస్‌మెంట్ ఛార్జీస్ (ప్రతి నెల‌) రూ.1,030, లేబొర‌టొరీ డిపాజిట్ రూ.2,060, హాస్టల్ రూమ్ రెంట్ (ప్రతి సెమిస్టర్‌) రూ.2,060, లైబ్రరీ డిపాజిట్ రూ.2,060, ఇత‌ర స్పెష‌ల్ ఫీజులు 15,069 క‌లిపి మొత్తం రూ.46,429 ఉంటుంది.

కోర్సులు...సీట్లు

బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చర్ కోర్సులో 147 సీట్లు, బీటెక్ అగ్రిక‌ల్చర్ ఇంజినీరింగ్ కోర్సులో 20 సీట్లు, బీటెక్ ఫుడ్ టెక్నాల‌జీ కోర్సులో 23 సీట్లు, బీఎస్సీ ఆన‌ర్స్ క‌మ్యూనిటీ సైన్స్ కోర్సులో 15 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు రెండేళ్ల ఇంట‌ర్మీడియ‌ట్‌, లేక‌పోతే 12 ఏళ్ల స్కూలింగ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యోల‌జీ, ఇంగ్లీష్, మాథ్యమెటిక్స్‌ స‌బ్జెట్స్‌లో స‌మాన ప‌రీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

సంబంధిత కథనం