NIA searches in AP : ఏపీతో పాటు మరో 2 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు - డిజిటల్ పరికరాలు స్వాధీనం
12 December 2024, 21:42 IST
- NIA searches in Andhra Pradesh: మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలోని చింతూరులో సోదాలు నిర్వహించింది. సోదాల్లో కొన్ని డిజిటల్ పరికరాలు, పత్రాలు స్వాధీనం చేసుకుంది.
ఎన్ఐఏ సోదాలు
ఎన్ఐఏ సోదాలు
మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు సహా… చత్తీస్ ఘడ్, ఒడిశాలో సోదాలు నిర్వహించింది.
చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును 2024 సెప్టెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ స్వీకరించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ.. దర్యాప్తు చేస్తూ వస్తోంది. ఈ సోదాల్లో భాగంగా… పేలుడు పదార్ధాలు, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర ఉపకరణాలు సరఫరా చేస్తున్న నెట్ వర్క్ ను గుర్తించినట్లు పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు బలగాలను చంపేందుకు కుట్ర పన్నినట్టు ప్రస్తావించింది.
టాపిక్