NIA Searches: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు… వీక్షణం వేణుగోపాల్ ఇంటితో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు…-nia searches in many places in hyderabad at the same time ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nia Searches: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు… వీక్షణం వేణుగోపాల్ ఇంటితో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు…

NIA Searches: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు… వీక్షణం వేణుగోపాల్ ఇంటితో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు…

Sarath chandra.B HT Telugu
Feb 08, 2024 07:33 AM IST

NIA Searches: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపాయి. తెల్లవారుజాము నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు జరుపుతున్నాయి.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు (ఫైల్)
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు (ఫైల్) (HT_PRINT)

NIA Searches: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్‌ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది.

yearly horoscope entry point

మహారాష్ట్ర పూణే పోలీసులు నమోదు చేసిన కేసులో రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావుకు వేణుగోపాల్ అల్లుడు అవుతారు. మావోయిస్టు ఉద్యమానికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఆయన నివాసంలో సోదాలు దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిమాయత్‌ నగర్‌, ఎల్‌బి నగర్‌లోని పలు ప్రాంతాల్లో న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి.

గత ఏడాది అక్టోబర్‌లో….

గత ఏడాది అక్టోబర్‌లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. పౌర హక్కుల సంఘాలు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పలువురి ఇళ్ళలో తనిఖీలు నిర్వహించారు.

అక్టోబర్‌ 3న నెల్లూరు జిల్లాలో పౌర హక్కుల సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు ఇంట్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పౌరహక్కుల సంఘం నాయకులు, న్యాయవాదుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు జరిపారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహించారు.

అదే సమయంలో హైదరాబాద్‌లో పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది సురేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. న్యాయవాది సురేష్‌తో పాటు అతని బంధుమిత్రుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య నివాసంలో సోదాలు చేపట్టారు.

హైదరాబాద్‌లో పౌరహక్కుల సంఘం నాయకురాలు భవానీ నివాసంలో సోదాలు జరిగాయి.గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూల పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు నివాసంలో సోదాలు నిర్వహించారు.

శ్రీకాకుళంలో కులనిర్మూలన పోరాట నాయకుడు మిస్కా కృష్ణయ్య నివాసంలో సోదాలు చేపట్టారు. నెల్లూరులో పౌర హక్కుల సంఘం నాయకులు అరుణ, వెంకటేశ్వరరావు నివాసంలో సోదాలు జరిగాయి. నెల్లూరు ఉస్మాన్ సాహెబ్‍పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరిపారు. ఏపీ సిఎల్‌సి ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో ఎన్ఐఏ దాడులు చేయడం కలకలం రేపింది.

రెండు దశాబ్దాలుగా అణగారిన వర్గాల పక్షాన నిలబడి పౌర హక్కుల ఉద్యమంలో ఎల్లంకి వెంకటేశ్వర్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అనేక ఉద్యమాల్లో భాగస్వాములుగా వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తూ పౌర హక్కుల ప్రజలను నిరంతరం చైతన్యం చేయడంలో ఎల్లంకి వెంకటేశ్వర్లు ముందు వరుసలో ఉన్నారు. ప్రజా గొంతుకుని వినిపించడంలో హక్కుల గురించి మాట్లాడడంలో ముందున్న ఎల్లంకి వెంకటేశ్వర్లపై గత కొంతకాలంగా ఎన్ఐఎ టీం నిఘా ఏర్పాటు చేసి ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు చేపట్టింది. ఎన్‌ఐఏ సోదాలను పౌరహక్కుల సంఘాలు, న్యాయవాదులు ఖండించారు.

అప్పట్లో విజయవాడలో కూడా ఎన్‌ఐఏ సోదాలు జరిగాయి. విజయవాడ శివార్లలోని పినైనవరం గ్రామంలో చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాధ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. విజయవాడ చిట్టినగర్‌లో అడ్వకేట్ అరసవిల్లి కృష్ణ, పూర్ణనందం పేటలో అడ్వకేట్ ఆంజనేయులు నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసింది.

Whats_app_banner