తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bhuma Akhila Priya : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసు, భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు

Bhuma Akhila Priya : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసు, భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు

24 May 2023, 16:36 IST

    • Bhuma Akhila Priya : నంద్యాలలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమ అఖిల ప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సాయంత్రం ఆమె కర్నూలు జైలు నుంచి విడుదల కానున్నారు.
భూమా అఖిల ప్రియ
భూమా అఖిల ప్రియ (Image Credit : Akhila Priya Instagram)

భూమా అఖిల ప్రియ

Bhuma Akhila Priya : నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాలలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో ఇటీవల మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు అరెస్ట్ అయ్యారు. ఆమెకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఆమెకు బెయిల్‌ మంజూరైంది. బుధవారం సాయంత్రం అఖిల ప్రియ కర్నూలు జైలు నుంచి విడుదల కానున్నారు.

ట్రెండింగ్ వార్తలు

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

అసలేం జరిగింది?

ఈ నెల 17న నంద్యాలలో నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదుతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులపై పోలీసులు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారిని నంద్యాల కోర్టులో ప్రొడ్యూస్ చేయగా... కోర్టు భూమా అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో అఖిల ప్రియ దంపతులను పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. ఈ నెల 17న కొత్తపల్లి వద్ద టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిలప్రియ దంపతులను పాణ్యం పోలీసులు అరెస్టు చేశారు.

నంద్యాల ఆధిపత్య పోరు

నంద్యాల జిల్లాలో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితులు. అయితే భూమా నాగిరెడ్డి మరణం అనంతరం ఆ కుటుంబానికి దూరం జరిగారు ఏవీ సుబ్బారెడ్డి. దీంతో నంద్యాలలో రాజకీయాలు మారిపోయాయి. లోకేశ్ పాదయాత్రలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు ఒక్కరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది. ఈ ఇష్యూపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ పరంగా ఓ కమిటీ వేసి, ఘనటపై పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటి వారైనైనా ఉపేక్షించమని హెచ్చరించారు.

అఖిలప్రియపై జస్వంతి రెడ్డి ఫైర్

టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనపై ఆమె కుమార్తె జస్వంతి రెడ్డి ఇటీవల స్పందించారు. తన తండ్రికి ఎలాంటి గాయాలు కాలేదని, ఈ ఘటనలో షర్ట్ మాత్రమే చిరిగిందన్నారు. మాజీ మంత్రి అఖిల ప్రియపై జస్వంతి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భూమా నాగిరెడ్డి తాను, ఏవీ సుబ్బారెడ్డి వేరు కాదని చాలాసార్లు చెప్పారన్నారు. తండ్రి లాంటి వ్యక్తిపై దాడికి పాల్పడ్డారని జస్వంతి రెడ్డి ఆవేదన చెందారు. చిన్నప్పటి నుంచి అఖిలప్రియను ఎత్తుకుని పెంచిన వ్యక్తిపై దారుణమైన ఆరోపణ చేస్తున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అఖిలప్రియ తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేయించారని మండిపడ్డారు.