తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandyal Collector Sign Forgery : వక్ఫ్ బోర్డు భూమి కొట్టేసేందుకు భారీ కుట్ర, నంద్యాల కలెక్టర్ సంతకం ఫోర్జరీ!

Nandyal Collector Sign Forgery : వక్ఫ్ బోర్డు భూమి కొట్టేసేందుకు భారీ కుట్ర, నంద్యాల కలెక్టర్ సంతకం ఫోర్జరీ!

22 May 2023, 18:08 IST

    • Nandyal Collector Sign Forgery : నంద్యాల జిల్లాలో భూకబ్జా కేటుగాళ్లు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసే స్థాయికి వెళ్లారు. రూ.80 లక్షల చేసే వక్ఫ్ బోర్డు భూమిని కొట్టేసేందుకు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ఉత్తర్వులు ఇచ్చారు.
నంద్యాల కలెక్టర్ సంతకం ఫోర్జరీ
నంద్యాల కలెక్టర్ సంతకం ఫోర్జరీ (Unsplash )

నంద్యాల కలెక్టర్ సంతకం ఫోర్జరీ

Nandyal Collector Sign Forgery : నంద్యాల జిల్లాలో భూబకాసురుల ఆగడాలకు హద్దులేకుండా పోయింది. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి రూ.80 లక్షల విలువైన భూమి కొట్టేయాలని ప్లాన్ వేశారు. జిల్లాలోని మహానంది మండలం యు.బొల్లవరంలో సర్వే నంబర్-486లో వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన 2.86 ఎకరాలు భూమి సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌ ఈ భూమిని వక్ఫ్‌బోర్డు పరిధి నుంచి తొలగించినట్లు ఫోర్జరీ సంతకంతో ఉత్తర్వులు రెడీ చేశారు. అయితే ఈ విషయం రెవెన్యూ అధికారుల ద్వారా కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తన సంతకాన్నే ఫోర్జరీ చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మహానంది తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు

TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

ఫోర్జరీ సంతకంతో ఉత్తర్వులు

వక్ఫ్ బోర్డు భూమిని బహిష్కృత ప్రాపర్టీస్ నుంచి కలెక్టర్ తొలగించినట్లు ఫోర్జరీ సంతకంతో ఉత్తర్వులు వచ్చాయని మహానంది తహసీల్దార్ తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు. ఫోర్జరీ సంతకంతో ఉత్తర్వులు ఇవ్వడంపై పోలీసులు కేసు నమోదుచేశారని, ఈ కేసుపై రెవెన్యూ, పోలీసుల విచారణ చేస్తున్నారని తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటారన్నారు.