తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Photographer Murder : కెమెరా కోసం దారుణం, వెడ్డింగ్ షూట్ ఉందని పిలిచి ఫొటో గ్రాఫర్ హత్య!

Photographer Murder : కెమెరా కోసం దారుణం, వెడ్డింగ్ షూట్ ఉందని పిలిచి ఫొటో గ్రాఫర్ హత్య!

03 March 2024, 14:14 IST

google News
    • Photographer Murder : విశాఖకు చెందిన ఫొటో గ్రాఫర్ సాయి కుమార్ రావులపాలెంలో దారుణ హత్యకు గురయ్యాడు. వెడ్డింగ్ ఫొటో షూట్ ఉందని పిలిచి... సాయి కుమార్ ను హత్య చేశారు.
వెడ్డింగ్ షూట్ ఉందని పిలిచి ఫొటో గ్రాఫర్ హత్య
వెడ్డింగ్ షూట్ ఉందని పిలిచి ఫొటో గ్రాఫర్ హత్య

వెడ్డింగ్ షూట్ ఉందని పిలిచి ఫొటో గ్రాఫర్ హత్య

Photographer Murder : వెడ్డింగ్ ఫొటో షూట్(Wedding Photo Shoot) ఉందంటూ పిలిచి ఫొటో గ్రాఫర్ ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. విశాఖ జిల్లా మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయి కుమార్ ఫొటో గ్రాఫర్(Visakha Photographer) గా పనిచేస్తుంది. ఆన్‌ లైన్‌ ద్వారా బుకింగ్‌లు తీసుకొని దూర ప్రాంతాల ఈవెంట్‌లకు వెళ్తుంటాడు. గత నెల 26న కోనసీమ జిల్లా(Konaseema) రావులపాలెంలో వెడ్డింగ్ ఫొటో షూట్ ఉందంటూ సాయి కుమార్ కు కొంతమంది వ్యక్తులు మెసేజ్ పెట్టారు. . ఇలా ఫొటో షూట్ కు వెళ్లిన సాయి.. ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు ఫోన్ చేసినా...ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో సాయి కుమార్ బంధువులు విశాఖ పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన ఇద్దరు యువకులు ఫొటోషూట్‌ ఉందని ఫిబ్రవరి 26న సాయి కుమార్‌ను పిలిచారు. పెళ్లి ఫొటోలు తీసేందుకు రావులపాలెం వెళ్తున్నట్లు సాయి ఇంట్లో చెప్పాడు. సుమారు రూ.15 లక్షల విలువైన కెమెరా సామగ్రితో సాయి రావులపాలెం బయలుదేరి వెళ్లాడు.

ఫొటో షూట్ ఉందని పిలిచి హత్య

విశాఖ నుంచి రైలులో రాజమండ్రి (Rajahmundry)వచ్చిన సాయి కుమార్‌ ను... ఇద్దరు యువకులు కారులో వచ్చి తీసుకెళ్లారు. రావులపాలెం సమీపంలో ఆ ఇద్దరు యువకులు సాయి కుమార్ ను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం సాయి కుమార్ కెమెరా, ఇతర సామాగ్రిని తీసుకుని పరారయ్యారు. అయితే కుమారుడి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోయేసరికి కంగారు పడిన సాయి తల్లిదండ్రులు...ముందు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి కుమార్ తల్లిదండ్రులు ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసుగా(Missing Case) నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాపు చేపట్టారు. సాయి కుమార్ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా షణ్ముఖ తేజ ఇంటికి వెళ్లారు పోలీసులు. అతడు ఇంట్లో లేకపోవడం... అతడి ఇంట్లో కెమెరా, సామాగ్రి ఉండడంతో పోలీసులు అతడిని అనుమానించారు.

నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల ప్లాన్

పరారీలో ఉన్న నిందితుడు షణ్ముఖ తేజను పట్టుకునేందుకు పోలీసులు మాస్టర్ ప్లాన్ వేశారు. షణ్ముఖ తేజకు ఫేస్ బుక్ లో విశాఖకు చెందిన అమ్మాయితో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ అమ్మాయితో షణ్ముఖకు ఫేస్ బుక్(Face Book) ఛాట్ చేయించారు. ఆ అమ్మాయి మెసేజ్‌లకు షణ్ముఖ తేజ రిప్లై ఇవ్వటంతో...ట్రేస్ చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో సాయికుమార్ ను హత్య చేసినట్లు షణ్ముఖ తేజ అంగీకరించాడు. సాయి కుమార్ దగ్గరున్న కెమెరా, సామాగ్రి కోసమే అతడిని హత్య చేసినట్లు నిందితుడు షణ్ముఖ తేజ ఒప్పుకున్నాడు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబానికి ఆధారమైన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న సాయి కుమార్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

తదుపరి వ్యాసం