తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Crime : మద్యం తాగొద్దని మందలించిన తండ్రి, హత్య చేసిన తనయుడు

Medak Crime : మద్యం తాగొద్దని మందలించిన తండ్రి, హత్య చేసిన తనయుడు

HT Telugu Desk HT Telugu

02 March 2024, 17:12 IST

google News
    • Medak Crime : మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మద్యం బానిసై, జులాయిగా తిరుగుతున్నాడని కొడుకును మందలించాడు తండ్రి. దీంతో కొడుకు తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు.
మద్యం తాగొద్దని మందలించిన తండ్రి, హత్య చేసిన తనయుడు
మద్యం తాగొద్దని మందలించిన తండ్రి, హత్య చేసిన తనయుడు

మద్యం తాగొద్దని మందలించిన తండ్రి, హత్య చేసిన తనయుడు

Medak Crime : మెదక్ జిల్లాలో(Medak) తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. తాగుడుకు(Liquor) బానిసై పనిపాట లేకుండా తిరుగుతున్న కొడుకుని మందలించాడన్న కోపంతో కన్న తండ్రిని కొట్టి హత్య(Murder) చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూచారం గ్రామానికి చెందిన బొంతపల్లి చంద్రయ్య (46), నర్సమ్మ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నాడు. కాగా కూతురు వివాహం చేశారు. కొడుకు ప్రశాంత్ ఏ పని చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. కష్టపడి పని చేసుకోవాలని, అలా తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని నిత్యం చెబుతుండేవాడు. కానీ కుమారుడు తరచూ మద్యం తాగి వచ్చి తండ్రితో గొడవపడేవాడు.

గొడ్డలి కామతో తలపై బలంగా కొట్టడంతో

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం చంద్రయ్య ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో కుమారుడు ప్రశాంత్ ఇంటికి వచ్చి ఫ్యాన్ వేసుకోవడంతో తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి గురైన ప్రశాంత్ ఇంట్లో ఉన్న గొడ్డలి కామతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కాగా వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనంలో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి(Govt Hospital) తరలించారు. కాగా అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి, పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లామని సూచించారు. కానీ కుటుంబ సభ్యులు ఉదయాన్నే హైదరాబాద్ తీసుకెళ్తామని చంద్రయ్యను రాత్రి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో చంద్రయ్య పరిస్థితి విషమించి రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

నర్సాపూర్ అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య

వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy) నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి అటవీ ప్రాంతంలో జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామానికి చెందిన దుర్గేష్ (29) ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కాగా గురువారం ఉదయం మొబైల్ ఫోన్ రిపేర్ చేసుకోవద్దని వెళ్తున్నానని దుర్గేష్ ఇంట్లో చెప్పి వెళ్లాడు. కానీ అతడు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం చిప్పల్ తుర్తి అటవీ ప్రాంతంలో స్థానికులకు శవమై కనిపించాడు. వారు వెంటనే గ్రామస్థులకు,పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. అతడి శరీరంపై, ముఖంపై పలు చోట్ల గాయాలున్నట్లు గుర్తించారు. మృతుడి వద్ద ఆధారాలతో అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అతడిని ఇక్కడికి తీసుకవచ్చి హత్యా చేశారా? .. లేక వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య ,ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

తదుపరి వ్యాసం