తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kodali Nani Comments : నా మీద చంద్రబాబు పోటీ చేసినా.. నేను రెడీ

Kodali Nani Comments : నా మీద చంద్రబాబు పోటీ చేసినా.. నేను రెడీ

HT Telugu Desk HT Telugu

21 November 2022, 17:51 IST

    • Kodali Nani On Chandrababu : చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. సినిమా షూటింగ్స్ మాదిరి.. చంద్రబాబు జిల్లాల పర్యటనలు జరుగుతున్నాయన్నారు.
కొడాలి నాని(ఫైల్ ఫొటో)
కొడాలి నాని(ఫైల్ ఫొటో) (YSRCP official site)

కొడాలి నాని(ఫైల్ ఫొటో)

చంద్రబాబుపై కొడాలి నాని(Kodali Nani) మరోసారి విమర్శలు చేశారు. చంద్రబాబు(Chandrababu)కు మాత్రమే కాదని, టీడీపీ(TDP)కి కూడా ఇవే చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్స్‌ మాదిరిగా చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు లాంటి సైకో మరోకరు లేరు అని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

Ooty, Kodaikanal: వేసవి సెలవుల్లో ఊటీ, కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా, వెళ్లాలంటే ఈపాస్ తప్పనిసరి..

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

'జిల్లాల పర్యటనల్లో టీడీపీ(TDP) కార్యకర్తలను ప్రజలుగా భావిస్తూ చంద్రబాబు అభివాదాలు చేస్తున్నారు. ఆయనను మించిన సైకో మరొకరు ఉండరు. కర్నూలు(Kurnool)లో హైకోర్టు(High Court) గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతా అని చంద్రబాబు అంటున్నారు. 2024 ఎన్నికల తర్వాత ఇదేం కర్మరా అని చంద్రబాబు, లోకేష్(Lokesh) అనుకునే రోజులు వస్తాయి. చంద్రబాబు పర్యటనలకు ముందుగానే పార్టీ కార్యకర్తలను జిల్లాలకు పంపిస్తున్నారు.' అని కొడాలి నాని అన్నారు.

నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే.. ప్రజలకు పోయేది ఏముందని కొడాలి నాని అన్నారు. బతికున్నంతకాలం వైఎస్ జగన్(YS Jagan) సీఎంగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రజలను టీడీపీ మోసం చేసిందని విమర్శించారు. గుడివాడ(Gudiwada)లో ఎవరికీ భయపడేది లేదని కొడాలి నాని(Kodali Nani) స్పష్టం చేశారు. ఎవరు వచ్చినా.. గుడివాడను ప్రభావితం చేయలేరన్నారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా తాను రెడీ అని సవాల్ విసిరారు. ఆఖరి రక్తపు బొట్టు వరకూ జగన్ వెంటే ఉంటానని చెప్పారు.

అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు వైసీపీని బలపరుస్తున్నారనే భయం చంద్రబాబుకు పట్టుకుంద్నారు. ఏది ఏమైనా.. రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు తపన పడుతున్నారన్నారు. అందుకే సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.