తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tirumala Brahmotsavam 2022: శ్రీవారి గరుడ వాహన సేవ.. భక్తజన సంద్రంగా తిరుగిరులు

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి గరుడ వాహన సేవ.. భక్తజన సంద్రంగా తిరుగిరులు

01 October 2022, 20:53 IST

Garuda Vahana Seva at Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

  • Garuda Vahana Seva at Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ‌నివారం రాత్రి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు త‌న‌కెంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్త‌కోటికి ద‌ర్శ‌న‌మిచ్చారు.
(1 / 7)
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ‌నివారం రాత్రి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు త‌న‌కెంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్త‌కోటికి ద‌ర్శ‌న‌మిచ్చారు.(HT)
ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండ‌గా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ గరుడ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. అన్ని గ్యాల‌రీల వ‌ద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌ భాగ్యం క‌ల్పించారు.
(2 / 7)
ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండ‌గా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ గరుడ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. అన్ని గ్యాల‌రీల వ‌ద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌ భాగ్యం క‌ల్పించారు.(HT)
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
(3 / 7)
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.(HT)
గరుడ వాహన సేవ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఏపీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
(4 / 7)
గరుడ వాహన సేవ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఏపీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు.(HT)
రెండేళ్ల తర్వాత భక్తుల మధ్యలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం,  పెరటాసి మాసం రెండో శనివారం కావడం, శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహన సేవ... ఈ 3 అంశాలు కలిసి రావడంతో తిరుగిరులు భక్తజనసంద్రంగా మారాయి. దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు గరుడ వాహన సేవలో పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
(5 / 7)
రెండేళ్ల తర్వాత భక్తుల మధ్యలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం,  పెరటాసి మాసం రెండో శనివారం కావడం, శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహన సేవ... ఈ 3 అంశాలు కలిసి రావడంతో తిరుగిరులు భక్తజనసంద్రంగా మారాయి. దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు గరుడ వాహన సేవలో పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.(HT)
గరుడ వాహనసేవలో భాగంగా సంస్కృతిగా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పురాణగాథలను ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. 
(6 / 7)
గరుడ వాహనసేవలో భాగంగా సంస్కృతిగా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పురాణగాథలను ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. (HT)
బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు గ‌జ‌వాహనంపై తిరుమల శ్రీవారు భక్తులను కటాక్షించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
(7 / 7)
బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు గ‌జ‌వాహనంపై తిరుమల శ్రీవారు భక్తులను కటాక్షించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి