తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుప‌తి వెళ్లే రైళ్ల‌కు అద‌న‌పు బోగీలు...స్పెష‌ల్ ట్రైన్స్ పొడిగింపు

Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుప‌తి వెళ్లే రైళ్ల‌కు అద‌న‌పు బోగీలు...స్పెష‌ల్ ట్రైన్స్ పొడిగింపు

HT Telugu Desk HT Telugu

03 October 2024, 10:59 IST

google News
    • Special Trains : ప్ర‌యాణికుల‌కు సౌత్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. 6 తిరుప‌తి రైళ్ల‌కు అద‌న‌పు బోగీలను అనుసంధానం చేస్తున్న‌ట్లు తెలిపింది. న‌ర‌సాపురం- హైద‌రాబాద్ మ‌ధ్య రెండు స్పెష‌ల్ రైళ్లు పొడిగించిన‌ట్లు వెల్లడించింది. 
తిరుప‌తి వెళ్లే రైళ్ల‌కు అద‌న‌పు బోగీలు
తిరుప‌తి వెళ్లే రైళ్ల‌కు అద‌న‌పు బోగీలు (@trainwalebhaiya)

తిరుప‌తి వెళ్లే రైళ్ల‌కు అద‌న‌పు బోగీలు

తిరుమ‌ల శ్రీవారి బ్ర‌హ్మోమ‌త్స‌వాల సంద‌ర్భంగా తిరుప‌తి వెళ్లే భ‌క్తుల సౌక‌ర్యార్ధం.. అద‌న‌పు బోగీల‌ను అనుసంధానం చేస్తున్న‌ట్లు ద‌క్షిణ మధ్య రైల్వే తెలిపింది. చెన్నై సెంట్రల్‌- తిరుప‌తి స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ (16057) రైలుకు అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు అద‌నంగా ఒక జ‌న‌ర‌ల్ బోగీ, ఒక ఛైర్‌కార్ బోగీల‌ను అనుసంధానం చేస్తున్న‌ట్లు అధికారులు వెల్లడించారు. తిరుప‌తి -చెన్నై సెంట్రల్ స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ (16057) రైల‌ుకు అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు అద‌నంగా ఒక జ‌న‌ర‌ల్ బోగీ, ఒక ఛైర్‌కార్ బోగీల‌ను అనుసంధానం చేశారు.

ఎంజీఆర్ చెన్నై సెంట్ర‌ల్- తిరుప‌తి మ‌ధ్య న‌డిచే తిరుప‌తి ఎక్స్‌ప్రెస్ (16053) రైలుకు అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు అద‌నంగా ఒక జ‌న‌ర‌ల్ బోగీ, ఒక ఛైర్‌కార్ బోగీల‌ను అనుసంధానం చేశారు. తిరుప‌తి- ఎంజీఆర్ సెంట్ర‌ల్ చెన్నై సెంట్ర‌ల్‌ ఎక్స్‌ప్రెస్ (16054) రైలుకు అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు అద‌నంగా ఒక జ‌న‌ర‌ల్ బోగీ, ఒక ఛైర్‌కార్ బోగీల‌ను అనుసంధానం చేశారు.

కోయంబ‌త్తూర్‌- తిరుప‌తి ఇంటర్ సీటీ ఎక్స్‌ప్రెస్ (22616) రైలుకు అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు అద‌నంగా ఒక జ‌న‌ర‌ల్ బోగీ, ఒక ఛైర్‌కార్ బోగీల‌ను అనుసంధానం చేశారు. తిరుప‌తి- కోయంబ‌త్తూర్ ఇంటర్ సీటీ ఎక్స్‌ప్రెస్ (22615) రైలుకు అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు అద‌నంగా ఒక జ‌న‌ర‌ల్ బోగీ, ఒక ఛైర్‌కార్ బోగీల‌ను అనుసంధానం చేశారు.

తిరుప‌తి- బెంగళూరు ఇంటర్ సీటీ ఎక్స్‌ప్రెస్ (22617) రైలుకు అక్టోబ‌ర్ 4 నుండి అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు అద‌నంగా ఒక జ‌న‌ర‌ల్ బోగీ, ఒక ఛైర్‌కార్ బోగీల‌ను అనుసంధానం చేశారు. బెంగ‌ళూరు- తిరుప‌తిఇంటర్ సీటీ ఎక్స్‌ప్రెస్ (22618) రైలుకు అక్టోబ‌ర్ 4 నుండి అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు అద‌నంగా ఒక జ‌న‌ర‌ల్ బోగీ, ఒక ఛైర్‌కార్ బోగీల‌ను అనుసంధానం చేశారు.

విశాఖపట్నం- కిరండూల్ రైళ్ల‌కు అదనపు బోగీలు..

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేర్‌ డివిజన్ విశాఖపట్నం- కిరండూల్- విశాఖపట్నం రైళ్లకు అదనపు విస్టాడోమ్ కోచ్, థ‌ర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లను అనుసంధానం చేసింది.

1. విశాఖపట్నం- కిరండూల్ (08551) రైలుకు అక్టోబ‌ర్ 3 నుంచి అక్టోబ‌ర్ 19 వ‌ర‌కు అదనపు విస్టాడోమ్ కోచ్‌లను జ‌త చేశారు.

2. కిరండూల్- విశాఖపట్నం (08552) రైలుకు అక్టోబ‌ర్ 4 నుంచి అక్టోబ‌ర్ 10 వ‌ర‌కు అదనపు విస్టాడోమ్ కోచ్‌లను జ‌త చేశారు.

3. విశాఖపట్నం- కిరండూల్ (08551) రైలుకు అక్టోబ‌ర్ 4 నుంచి అక్టోబ‌ర్ 20 వ‌ర‌కు అదనంగా థ‌ర్డ్ ఏసీ ఎకాన‌మీ కోచ్‌ల‌ను జత చేశారు.

4. కిరండూల్- విశాఖపట్నం (08552) రైలుకు అక్టోబ‌ర్ 3 నుండి అక్టోబ‌ర్ 21 వ‌ర‌కు అదనంగా థ‌ర్డ్ ఏసీ ఎకాన‌మీ కోచ్‌ల‌ను జత చేశారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోవాల‌ని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీసీఎం కె.సందీప్ సూచించారు.

న‌ర‌సాపురం- హైద‌రాబాద్ మ‌ధ్య స్పెష‌ల్ రైళ్లు..

న‌ర‌సాపురం- హైద‌రాబాద్ మ‌ధ్య రెండు స్పెష‌ల్ రైళ్లు పొడిగించిన‌ట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే తెలిపింది. న‌ర‌సాపూర్- హైద‌రాబాద్ స్పెష‌ల్ ఎక్స్‌ప్రెస్ (07632) రైలును అక్టోబ‌ర్ 6 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు పొడిగించారు. హైద‌రాబాద్‌- న‌ర‌సాపూర్ ఎక్స్‌ప్రెస్ (07631) రైలును అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగిస్తూ ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీపీఆర్ఓ ఎ.శ్రీధ‌ర్ వెల్లడించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం