తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Perni Nani :వెయ్యి కోట్ల ముడుపుల మాటేమిటన్న పేర్నినాని

Perni Nani :వెయ్యి కోట్ల ముడుపుల మాటేమిటన్న పేర్నినాని

HT Telugu Desk HT Telugu

14 March 2023, 8:27 IST

    • Perni Nani జనసేన పేరుతో పవన్‌కళ్యాణ్‌ సర్కస్‌ మొత్తం చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాజకీయాల్లో నటనకు ఆస్కార్‌ ఉంటే.. అది ఏటా పవన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాపులు ఎవరి చేతిలోకి మారాలి, ఎందుకు మారాలని , చంద్రబాబు బాగుండాలన్నదే పవన్‌ అంతిమ లక్ష్యం పేర్నినాని  ఆరోపించారు.
మాజీ మంత్రి పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని

మాజీ మంత్రి పేర్ని నాని

Perni Nani రాజకీయాల్లో ఆస్కార్‌ అవార్డు ఉంటే ప్రతీ ఏటా అది పవన్‌కే దక్కుతుందని, అందులో నామినేషన్స్‌ ఏమి ఉండవని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. మంగళగిరి సభ, ఇప్పటం సభ, బందరు సభ. నామినేషన్లు మొత్తం పవన్‌కళ్యాణ్‌ వే ఉంటాయన్నారు. పవన్‌ కళ్యాణ్‌కు ప్రజా సేవ చేయాలని లేదని కమిట్‌మెంట్‌ అంత కంటే లేదని ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

ఏపీకి నెలలో రెండు రోజులు శని, ఆదివారాలు వస్తాడని ఏదేదో చెబుతాడని, అప్పుడు పవన్‌ మాట్లాడినవన్నీ ఆయన విమానం ఎక్కగానే గాల్లో కలిసి పోవాలన్నారు. పట్టుమని నాలుగు మాటలు మాట్లాడితే కులం అంటాడని, మళ్లీ కుల రహిత సమాజం అంటాడని, ఆయన పొలిటికల్‌ నటనకు ఆస్కార్‌ కూడా తక్కువేనన్నారు.

కాపులు, బీసీలు కలిసి ప్రభుత్వాన్ని మార్చాలంటున్న వపన్‌కళ్యాణ్‌, అసలు, వాళ్లిదరూ ఎందుకు కలవాలి? ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మార్చాలో చెప్పాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం, తీసుకున్న ప్రతి నిర్ణయం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం కోసమే అన్నారు. అలాంటిది, ఆయా వర్గాలన్నీ కలిసి తమకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎందుకు మార్చుకుంటారనేది పవన్‌ కళ్యాణ్‌ ఆలోచించలేక పోయాడని విమర్శించారు. బీసీలు, కాపులు కలిస్తే బాబు సీఎం అవుతాడని పవన్‌కళ్యాణ్‌ ఎందుకంత ఆశ పడుతున్నాడన్నారు.

కాపుల ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు చేసుకుంటానని పవన్‌ చెబుతున్నాడని, ఈ మాటలకు అర్థమేంటో చెప్పాలన్నారు. కాపులు అందర్నీ గౌరవించాలని ఎవరితో గొడవపడొద్దని చెబుతాడని అసలు, కాపులకు బీసీలకు, కాపులకు ఎస్సీలకు ఎక్కడైనా గొడవలున్నాయా అని ప్రశ్నించారు.పవన్‌కళ్యాణ్, చంద్రబాబు రాజకీయం కోసం మాలో మేం గొడవలు పడాలా అని పేర్ని నాని నిలదీశారు. అలుపు సొలుపు లేకుండా 2014 నుంచి చంద్రబాబుకు ఊడిగం చేస్తోంది ఎవరని ప్రశ్నించారు. పవన్ వెనకాలే తిరిగే నాదెండ్ల మనోహర్‌ చేసేదేంటన్నారు. పవన్‌కళ్యాణ్‌ చేస్తేనేమో రాజకీయం, వైఎస్‌ఆర్‌సీపీలో కాపులు మాత్రం ఊడిగం అంటూ ఇష్టానుసారంగా తిడతాడా అని ప్రశ్నించారు. తాను ఓట్లేయిస్తే తన తల్లిని తిట్టించారని 2014లో ఎవర్ని ఉద్దేశించి అరిచావో.. మళ్లా వెళ్లి వాళ్లతోనే కలిసి తిరుగుతున్నావంటే ఊడిగం చేసేది ఎవరని ప్రశ్నించారు.

సోషల్‌ ఇంజినీరింగ్‌ కూడా తెలియదు..

కులాల గురించి మాట్లాడే వవన్‌కళ్యాణ్‌ సోషల్‌ ఇంజినీరింగ్‌ అంటాడని, ఏ కులం ఏ జాబితాలో ఉందో కూడా ఈయనకు తెలియదన్నారు. జగన్‌ సీఎం అయ్యాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఉద్యోగ కల్పన దగ్గర్నుంచి ఏ రంగంలోనైనా సోషల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నారని, అధికారాన్ని అన్ని వర్గాలకూ సమపాళ్లలో పంచి పెట్టడమనేది దేశంలో ఏ రాష్ట్రంలో ఉందో చూడాలన్నారు. పదవులు, పనుల్లో ఈ స్థాయి సమ ప్రాధాన్యత ఎక్కడుందో చూపించాలన్నారు.

వెయ్యికోట్ల బేరాల గురించి మాట్లాడవెందుకు….

జగన్‌ దత్తపుత్రుడు అంటే విపరీతంగా పౌరుషం వస్తుందని, చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్‌వి అంటే చెప్పులు చూపించే పవన్ కళ్యాణ్, జనసేనపై వెయ్యి కోట్ల బేరాలు సాగుతున్నాయని రాస్తే నోరెందుకు మెదపలేదని నిలదీశారు. అప్పుడు చెప్పులు లేపడం తెలియదా, లేకుంటే తేలు కుట్టిన దొంగలా ఎందుకుండి పోయావన్నారు.

హరిరామజోగయ్య ఆ వయస్సులో కాపు సంక్షేమ సమితి అంటూ కాపుల రాజకీయ ప్రయోజనాల కోసం కష్ట పడుతుంటే.. పవన్‌ మాత్రం కమ్మ ప్రయోజనాల కోసం పని చేస్తానని చెప్పడం చాలా నీచమన్నారు. నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి, లక్ష్యం కలిగిన రాజకీయ నాయకుడివే అయితే కులంతో పనేంటని, నీ కులం ఏదైతే ఏంటని ? అసలు ప్రజా నాయకుడికి కులంతో పనేంటన్నారు.

2014 నుంచి 2023 వరకు పవన్‌ కళ్యాణ్‌ చరిత్ర, జనసేన బండారం ఏంటని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయాల కోసం పవన్ నీచంగా మాట్లాడుతున్నాడని, పులివెందుల, కడపలో ఎంతమంది కాపులు, బలిజలు ఉన్నారో తెలుసా అని నిలదీశారు. నిన్నటి దాకా గనులు నడిపిన సాయిప్రతాప్‌ చివరి దాకా ఎవరితో ఉన్నారని ప్రశ్నించారు.

భీమవరం, గాజువాకలో తన కులపోళ్లు ఓటేస్తే ఓడిపోయే వాడ్ని కాదని పవన్‌ చెబుతున్నాడని, ఆ మాట అనడానికి పవన్‌కు నోరెలా వచ్చిందన్నారు. ఒక కులం ఓటుతో శాసనసభలోకి వెళ్లాలనుకునే నీచ మనస్తత్వమా నీదని ప్రశ్నించారు. 2014లో కులం లేదన్నావని, 2019లో కాపు- కాపు బరంపురం అన్నాడని, 2024 ఎన్నికలు వచ్చే సరికి కాపుల ఆత్మ గౌరవం అంటున్నావన్నారు .కులం కంపుతో రాజకీయాలు చేయాలనుకోవడం పవన్‌ అమాయకత్వమని పేర్ని నాని ఎద్దేవా చేశారు.