తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Devi Sarannavaratri Celebrations Started In Vijayawada Indrakeeladri

kanaka Durga Devi : ఇంద్రకీలాద్రిపై స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ

B.S.Chandra HT Telugu

26 September 2022, 5:59 IST

    • kanaka Durga Devi Day 01 శ‌ర‌న్న‌వ‌రాత్రులు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా తొలిరోజు నిజ ఆశ్వయుజ‌ శుద్ధ పాఢ్య‌మి సోమ‌వారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ భ‌క్తుల‌కు స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత శ్రీ దుర్గాదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అష్ట భుజాలతో సింహాస‌నం మీద త్రిశూల‌ధారియై.. బంగారపు ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిసిపోయే ఆ త‌ల్లిని ద‌ర్శించుకోవ‌డం భ‌క్తుల‌కు క‌నుల పండుగగా ఉంటుంది. ఈ అలంకారంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ద‌రిద్రాలు తొలగిపోతాయంటారు. స్వ‌ర్ణ‌క‌వచాలంకృత క‌న‌క‌దుర్గా దేవి అలంకారంలో ద‌ర్శ‌న‌మిచ్చే రోజున అమ్మ‌వారికి ప్ర‌సాదంగా చ‌క్ర‌పొంగ‌లి, క‌ట్టెపొంగ‌లి నివేదిస్తారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

kanaka Durga Devi Day 01 బెజవాడ ఇంద్రకీలాద్రి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముస్తాబైంది. అమ్మ‌ల‌గ‌న్న అమ్మ , ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. శ్రీచక్ర అదిష్ఠాన దేవతగా కోరిన వారికి వరాలిచ్చే కొంగుబంగారంగా దుర్గమ్మ వాసికెక్కింది.

ట్రెండింగ్ వార్తలు

AP Heat Wave : చాగలమర్రిలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు-రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు

AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు - 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు, ఇవాళ 56 మండలాల్లో తీవ్ర వడగాలులు

"మాతర్మే మదుకైటభఘ్ని మహిషప్రాణాపహారోద్యమే

హేలనిర్మిత ధూమ్రలోచన వధే హేచండముండార్ధిని

నిశేషీకృత రక్తబీజ దనుజే నిత్యే: నిశుంభావహే

శుంభధ్వంసిని సంహారాశు దురితం దుర్గే - నమస్తే అంబికే" అంటూ ఈ రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.

పూర్వం మాధవవర్మ అనే రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు విజయవాటికాపురిలో (విజయవాడ) కనకవర్షం కురిపించిందని అప్పటి నుంచి అమ్మవారు కనకదుర్గగా కొలవబడుతుందని భక్తుల నమ్మకం. దసరా మహోత్సవాలలో స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవి అమ్మవారిని అలంకరిస్తారు. ఆ తల్లిని దర్శించుకుంటే సకల దారిద్ర్యాలు నశించి భక్తులకు రక్షణ లభిస్తుంది. కనకదుర్గ అలంకారంలో అమ్మవారి దర్శనం శుభకరం, ఐశ్యర్యప్రదాయకమని నమ్ముతారు.

దుర్గుణాలను పోగొట్టి కొలిస్తే కోరిన శుభాలనొసగే కరుణామయిగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకిగా కనకదుర్గమ్మ పేరును సంపాదించింది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మవారు కోట్లాది మంది భక్తులకు ఇలవేల్పు. నవరాత్రుల వేళ కరుణించవమ్మా.. కనకదుర్గమ్మా .. జై భ‌వానీ.. జైజై భ‌వానీ నామ‌స్మ‌ర‌ణ‌తో వేడుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలి వస్తున్నారు. కరోనా తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్తిస్థాయి దసరా ఉత్సవాలు kanaka Durga Devi Day 01 అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

ఆలయ కమిటీ ఉత్సవాల నిర్వహణకు చేస్తోన్న ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు kanaka Durga Devi Day 01సోమవారం నుంచి అక్టోబర్​ ఐదో తేదీ వరకు పది రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో రోజుకో రూపంలో దర్శనమిచ్చే ఆదిపరాశక్తిని పూజిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పది రోజుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు రావొచ్చని భావిస్తున్నారు.

ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తొలిరోజు kanaka Durga Devi Day 01 స్వర్ణ కవచాలంకృత అలంకరణలో మెరిసే కనకదుర్గాదేవి దర్శనం మాత్రం ఉదయం 9 గంటల తరువాతే కల్పిస్తారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకుని తొలి పూజలు చేయనున్నారు. ఉత్సవాల్లో రోజుకు 60 వేల మంది వరకు భక్తులు రావొచ్చని, అక్టోబర్​ రెండో తేదీ అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున రెండు లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

kanaka Durga Devi Day 01 కృష్ణానదిలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నది స్నానాలను పూర్తిగా నిషేధించి ఘాట్ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. దసరా సమయంలో కృష్ణానది పరవళ్లు తొక్కడం గత పాతికేళ్లలో ఎన్నడూ లేదు. వినాయక గుడి నుంచి టోల్‌గేటు ద్వారా ఓం మలుపు వరకు మూడు వరసలు, ఓం మలుపు వద్ద అదనంగా ఉచిత దర్శనానికి, వీఐపీలకు ఒక్కొక్క క్యూలైను చొప్పున మొత్తం ఐదు వరుసలు ఏర్పాటు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాలు, పున్నమిఘాట్‌ వద్ద తాత్కాలికంగా షెడ్లు నిర్మించారు. భక్తుల కోసం సుమారు 20 లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం సర్వదర్శనంతోపాటు వంద, మూడు వందల రూపాయల టిక్కెట్లను, వీఐపీలకు ఐదు వందల రూపాయల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేశారు.

దసరా kanaka Durga Devi Day 01 ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల అర్చన, బాలబోగ నివేదన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన అవకాశం కల్పిస్తారు. చతుర్వేద పారాయణలు, మహావిద్య, సుందరకాండ, సప్తశతి, చండీనవాక్షరి, బాలమంత్రం, సూర్య నమస్కారాలు, లక్ష్మీగణపతి, శివపంచాక్షరీ, నవగ్రహ జపం, లలితా సహస్రనామ పారాణాయాలతో పాటు ప్రతిరోజు కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు.

ఈ సంవత్సరం గతానికి భిన్నంగా ఆలయ ప్రాంగణం మొత్తం దేదీప్యమానమైన విద్యుత్తు దీపాలంకరణ, లేజర్‌షోలను ఏర్పాటు చేశారు. కృష్ణాతీరం వెంబ‌డి ముందస్తుగా గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతారాణా తాతా వెల్లడించారు. సుమారు 4వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు 12 చోట్ల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడల్‌ గెస్ట్‌ వద్ద కమాండ్‌ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని, 400 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.