తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan Pays Triibutes On Police Commemoration Day

CM Jagan : పోలీస్ ఉద్యోగాల భర్తీలో హోంగార్డులకు రిజర్వేషన్లు…..సిఎం జగన్

HT Telugu Desk HT Telugu

21 October 2022, 9:06 IST

    • CM Jaganఏపీలో చేపడుతున్న పోలీస్ ఉద్యోగాల నియామకంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సిఎం జగన్ ప్రకటించారు.  63వ పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సిఎం ఘనంగా నివాళులు అర్పించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో  హోంమంత్రి తానేటి వనిత, డిజిపి, సిఎస్‌ తదితరులు పాల్గొన్నారు. 
పోలీస్ అమర వీరుల దినోత్సవంలో సిఎం జగన్
పోలీస్ అమర వీరుల దినోత్సవంలో సిఎం జగన్

పోలీస్ అమర వీరుల దినోత్సవంలో సిఎం జగన్

Cm Jagan విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిరవ్హించారు. పోలీస్ అమరవీరుల పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. పోలీస్ విధి నిర్వహణలో అనుకోని సంఘటనలు నిత్యం ఎదురవుతుంటాయని, సమాజం తరపున, ప్రభుత్వం తరపున పోలీసులకు ఎప్పుడు అండగా ఉంటామని సిఎం హామీ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : మే నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే

AP Heat Wave : చాగలమర్రిలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు-రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు

AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

1959 అక్టోబర్ 21న చైనా సైనికుల్ని ఎదురించి సాహసోపేతంగా జరిగిన యుద్ధానికి గుర్తుగా 63 ఏళ్ల క్రితం పోలీస్ అమరవీరుల దినోత్సవం ప్రారంభమైందని చెప్పారు. అమరులైన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించారు. దేశ వ్యాప్తంగా గత ఏడాది కాలంలో 261మంది పోలీసులు అమరులయ్యారని, రాష్ట్రంలో 11మంది చనిపోయారని, ఈ ఏడాది ముగ్గురు రాష్ట్ర పోలీసులు కోవిడ్ విధుల్లో చనిపోయారని చెప్పారు.

విధి నిర్వహణలో సమాజం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పోలీసు శాఖ కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వంగా వారి బాగోగుల మీద శ్రద్ధ పెడుతున్నామని, పని ఒత్తిడి తగ్గించడానికి భారీగా నియామకాలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి జీవో జారీ చేసినట్లు చెప్పారు. ఇన్ని వేల ఉద్యోగాలను గత ప్రభుత్వాలు ఎప్పుడు నియమించలేదని చెప్పారు.

6511 పోస్టుల భర్తీలో భాగంగా చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐఆర్‌ బెటాలియన్ దళాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవ వేతనం పెంచామని, తాజా రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీస్ శాఖలో 16వేల మంది మహిళా పోలీసుల్ని గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ శాఖలో దిశ యాప్‌, దిశ పోలీస్ స్టేషన్‌, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. కోటి30లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ యాప్‌ డౌన్ లోడ్ అయ్యిందని చెప్పారు.

పోలీస్ అమరవీరుల దినోత్సంలో భాగంగా అమరులు వారు పుస్తకాన్ని సిఎం ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు సీఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత, డిజిపి తానేటి వనిత నివాళులు అర్పించారు.