తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Review : ఆరోగ్యశ్రీలో చికిత్సలు పెంచాలి.. త్వరలో కొత్త విధానాలు

CM Jagan Review : ఆరోగ్యశ్రీలో చికిత్సలు పెంచాలి.. త్వరలో కొత్త విధానాలు

HT Telugu Desk HT Telugu

17 August 2022, 20:57 IST

google News
    • ఆరోగ్య శ్రీ కింద ప్రస్తుతం ఉన్న ప్రొసీజర్లను మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుపై అధికారులతో మాట్లాడారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా 754 ప్రొసీజర్లు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. ఈ కారణంగా మెుత్తం ప్రొసీజర్ల సంఖ్య 3,118కు చేరుతోంది. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు ఉంటారని అధికారులతో సీఎం జగన్ అన్నారు.

'ఆరోగ్య శ్రీ పరిధిలోకి కొత్తగా 754 ప్రొసీజర్లు అమల్లోకి తీసుకురావాలి. సెప్టెంబర్ 5 నుంచి కొత్త విధానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం కింద చికిత్స అందుతోన్న విధానాల సంఖ్య 3118కి చేరుతోంది. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్​ సమర్థవంతంగా అమలు చేయాలి. దీనికోసం మూడు అంశాలపై దృష్టి సారించాలి. విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉండాలి. అప్పుడే అందరికీ సరైన వైద్యం అందుతుంది.' అని సీఎం జగన్ అన్నారు.

వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లలో మూడు నుంచి నలుగురు సిబ్బంది ఉంటారు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్, ఒక ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా ఉంటారు. విలేజ్‌ క్లినిక్స్‌లో 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయి. 6956 టెలీమెడిసన్‌ స్పోక్స్, 27 హబ్స్‌ ఏర్పాటు చేయాలి. మెడికల్‌ హబ్స్‌ను అన్ని జిల్లాల వైద్య కళాశాలల్లో ఏర్పాటు చేస్తే మంచిది. జిల్లా వైద్య కళాశాల నేతృత్వంలోనే ఇవి పని చేస్తూ ఉండాలి. మెడికల్‌ హబ్స్‌ నుంచి చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లేలా ప్లాన్ చేయాలి.

- సీఎం జగన్

అవసరమైన అంబులెన్స్‌లను సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వీటికోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. పనులపై రోజూ సమీక్షించాలు చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై కసరత్తు పూర్తి చేస్తున్నట్లు జగన్ కు అధికారులు చెప్పారు. పీహెచ్‌సీలు, మొబైల్ మెడికల్ యూనిట్లు మ్యాపింగ్‌ పూర్తైందన్నారు. 656 ఎంఎంయూ 104లు పని చేస్తున్నాయన్నారు. మరో 432 వాహనాలను సమకూరుస్తున్నట్టు వివరించారు.

తదుపరి వ్యాసం