తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bjp : ఆంధ్రాకు రాజధాని లేకుండా చేసిందెవరని ప్రశ్నించిన సోము వీర్రాజు..

AP BJP : ఆంధ్రాకు రాజధాని లేకుండా చేసిందెవరని ప్రశ్నించిన సోము వీర్రాజు..

B.S.Chandra HT Telugu

06 August 2022, 6:40 IST

    • ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసిన పార్టీలను ప్రజల ముందు దోషిగా నిలబెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పోలవరం ఆర్‌ అండ్ ఆర్ ప్యాకేజీ వివరాలను జగన్ కేంద్రానికి ఎందుకు ఇవ్వట్లేదని సోము ప్రశ్నించారు. వివరాలు ఇస్తే వారి లొసుగులు బయటకు వస్తాయని భయపడుతున్నారని విమర్శించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి, టిడిపి లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. వైసీపీ నేతలు నిధుల కోసం ఒక‌ మాట,చేతికి అందాక మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు‌ చేసే మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కలిశారన్నారు. సుజనా చౌదరి చేసిన విజ్ఞప్తి వల్లే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారని గుర్తు చేశారు. బీజేపీని చంద్రబాబు మోసం చేశారే తప్ప, బిజెపి ఎప్పుడూ మాట తప్పలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కెసిఆర్ తో ఉండవల్లి ఎందుకు సమావేశమౌతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజధాని కోసం పాదయాత్ర చేసిన రైతులను , బిజెపి శ్రేణులను సోమువీర్రాజు స్వయంగా సన్మానించారు. బిజెపితో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్నా మోడీ మాత్రం ఏపి అభివృద్ధికి నిధులు ఇచ్చారని, నిధులు ఇచ్చినా రాజధానిని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్‌ మూడు రాజధానులు పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు.

ఎపి రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం ఏమిటని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని అభివృద్ధి కి బాధ్యత వహించాలన్నారు. రాజధాని కోసం కమ్యూనిస్టులు పాదయాత్ర చేస్తామంటున్నారని ఎప్పుడు ఎవరితో కలిసి నడుస్తారో వాళ్లకే తెలియదని ఎద్దేవా చేశారు.

ఏపిలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని, చంద్రబాబు ప్యాకేజీ ద్వారా నిధులు తీసుకుని ఇప్పుడు ప్రత్యేక హోదా అని ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. దోచుకోవడమ, దాచుకోవడం, దండుకోవడమే రెండు పార్టీ ల పని అయ్యిందని బిజెపి బలపడితే కుటుంబ పార్టీ లకు ఫుడ్ ఉండదన్నారు. గతంలో చంద్రబాబు ఎగిరారని, ఇప్పుడు పని అయిపోయిందని, ఇప్పుడు కేసిఆర్ ఎగురుతున్నారు తర్వాత అదే రిపీట్ అవుతుందన్నారు. భవిష్యత్తులో ఏపీలో కూడా ఇలాగే జరుగుతుందని కానీ సమయం రావాలన్నారు.

బతికుండగా పోలవరం చూడలేనని ఉండవల్లి అరుణ్‌ కుమార్ చెప్పడాన్ని తప్పు పట్టారు. ఇందిరాగాంధీ పై విమర్శలు చేసిన వ్యక్తి నేడు నేషనల్ హెరాల్డ్ గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ నుండి రాహుల్ గాంధీ‌ వరకు స్పీచ్ ట్రాన్స్ లేట్ చేశారని ఎవరిని ఏమి చేయలేక ఏదేదో మాట్లాడుతుంటారని విమర్శించారు.

టాపిక్