తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc : జులై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్‌

APSRTC : జులై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్‌

HT Telugu Desk HT Telugu

23 June 2022, 17:28 IST

    • ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పే స్కేల్ ప్రకారమే జీతాలు అందుకుంటారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్టీసీ ఉద్యోగులు జులైన 1 నుంచి ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెుత్తం 52 వేల మంది జీవితాల్లో దీంతో వెలుగునిండనున్నాయి. ఆర్టీసీని 2020 జనవరి 1న ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తూ వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

Ooty, Kodaikanal: వేసవి సెలవుల్లో ఊటీ, కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా, వెళ్లాలంటే ఈపాస్ తప్పనిసరి..

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

అయితే ఇప్పటి వరకూ.. కార్పొరేషన్‌ పే స్కేల్‌ ప్రకారమే జీతాలు చెల్లించేవారు. సీఎం జగన్ చొరవతో ఇటీవలే.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కేడర్‌ నిర్ధారణను ప్రభుత్వం పూర్తిచేసింది. దీంతో జులై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రభుత్వ పే స్కేల్ ప్రకారమే జీతాలు తీసుకోనున్నారు.

కేడర్‌కు తగినవిధంగా జీతాలు, ఇతర భత్యాలను ఉంటాయి. జీతాల చెల్లింపు విధానంపై జిల్లాలు, డిపోలవారీగా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. పే స్లిప్‌ల తయారీ, ఇతర పనులు సైతం కంప్లీట్ అయ్యాయి. తాజా పీఆర్సీ మేరకు ఏడాది కాలానికి ఫిట్‌మెంట్‌ను నిర్ణయిస్తారు. దీని ప్రకారమే.. అమలు చేస్తారు. దీంతో ఉద్యోగులకు లాభం చేకూరనుంది.

రాష్ట్ర ప్రధాన కేంద్రమైన విజయవాడలో పనిచేసే ఉద్యోగులందరికీ అదనపు హెచ్‌ఆర్‌ఏ చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చిన దాదాపు 200 మంది ఉద్యోగులకే అదనపు హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో విజయవాడలో పనిచేసే అందరికీ ఇది వర్తింప జేస్తారు. సుమారు 500 మంది లాభం పొందుతారు.

టాపిక్