తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vetaran Journalist Arrest : వాట్సాప్‌ మెసేజ్‌తో సీనియర్ జర్నలిస్ట్‌ అరెస్ట్‌…

Vetaran Journalist Arrest : వాట్సాప్‌ మెసేజ్‌తో సీనియర్ జర్నలిస్ట్‌ అరెస్ట్‌…

HT Telugu Desk HT Telugu

23 September 2022, 7:27 IST

    • Vetaran Journalist Arrest వాట్సాప్‌లో ప్రభుత్వ అధికారికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై వెటరన్ జర్నలిస్ట్‌ను ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి వద్ద కిలో బంగారం లభించడంపై  వాట్సాప్‌ సందేశాలను సర్క్యులేట్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌‌లో దొరికిన బంగారం సిఎంఓ అధికారికి చెందినదంటూ వాట్సాప్‌ మెసేజీలు పంపడం వెనుక కుట్ర ఉందనే అనుమానాల నేపథ్యంలో అంకబాబును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
సిఐడి అదుపులోకి తీసుకున్న జర్నలిస్టు అంకబాబు
సిఐడి అదుపులోకి తీసుకున్న జర్నలిస్టు అంకబాబు

సిఐడి అదుపులోకి తీసుకున్న జర్నలిస్టు అంకబాబు

Vetaran Journalist Arrest వాట్సాప్‌ సందేశాలను ఫార్వార్డ్‌ చేశారనే ఆరోపణలపై 74ఏళ్ల జర్నలిస్టును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు తెలుగు పత్రికలు, టీవీలలో వివిధ హోదాల్లో పనిచేసిన విజయవాడకు చెందిన కొల్లు అంకబాబును గురువారం సాయంత్రం సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న కొంతమంది పోలీస్‌ అధికారులు గురువారం సాయంత్రం ఆయన్ని బలవంతంగా ఇంటి నుంచి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారం దుమారం రేపింది.

ట్రెండింగ్ వార్తలు

TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Vetaran Journalist Arrest వ్యవహారం విజయవాడలో కలకలం రేపింది. వాట్సాప్ సందేశాలను ఫార్వార్డ్‌ చేశారనే అభియోగాలపై సిఐడి అధికారులు అంకబాబును అదుపులోకి తీసుకున్నారు. గత వారం విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కిలో బంగారం పట్టుబడింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన డిఆర్‌ఐ అధికారులు ప్రభుత్వ అధికారి సతీమణిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై తొలుత రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలో వాట్సాప్‌ సందేశాలను ఫార్వార్డ్‌ చేశారనే ఆరోపణలతో అంకబాబును అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

గురువారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో సిఐడి అధికారులుVetaran Journalist Arrest అంకబాబును తమ వెంట రావాల్సిందిగా కోరారు. ఎక్కడకు తీసుకువెళుతున్నారని అంకబాబు భార్య ప్రశ్నించడంతో గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో సిఎంఓ అధికారులకు సంబంధం ఉందని అంకబాబు వాట్సాప్‌లో సందేశాలు ఫార్వార్డ్‌ చేశారని వాటి గురించి ప్రశ్నించడానికి తీసుకువెళుతున్నట్లు చెప్పారు. ఓ అరగంట పాటు ప్రశ్నించి పంపేస్తామని వారికి చెప్పి అంకబాబును బలవంతంగా తీసుకువెళ్లారు. రాత్రి 9.30దాటాక గుంటూరులోని సిఐడి కార్యాలయానికి అంకబాబును తరలించారు.

గురువారం రాత్రి పొద్దుపోయే వరకు అంకబాబును అదుపులోకి తీసుకున్నట్లు, అరెస్ట్‌చేసినట్లు సిఐడి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. విజయవాడ విమానాశ్రయంలో దొరికిన బంగారం సిఎంఓలో పనిచేస్తున్న కీలక అధికారికి సంబంధించనదిగా తొలుత ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఒకే పేరుతో ఉన్న వేర్వేరు అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. నిందితురాలిని విడిచిపెట్టే విషయంలో సిఎంఓ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని వాట్సాప్‌ సందేశాలు సర్క్యూలేట్ అయ్యాయి. మరోవైపు అంకబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేతలు గుంటూరులోని సిఐడి కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

అంకబాబు అరెస్టు అక్రమం… టీడీపీ అధినేత చంద్రబాబు

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అక్రమ అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వాట్సాప్‌లో ఒక వార్తను ఫార్వర్డ్ చేసిన కారణం గానే అరెస్ట్ చెయ్యడాన్ని గా తప్పు పట్టారు. అక్రమ కేసులు, అరెస్ట్ లతో సీఐడీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతుందని చంద్రబాబు అన్నారు. 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుందని చంద్రబాబు అన్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుబడిన విషయం వాస్తవం కాదా అని ఆ వార్తను ఫార్వర్డ్ చేస్తే తప్పు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. వెంటనే అంకబాబు ను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

73 ఏళ్ల వయసులో ఉన్న జర్నలిస్ట్‌ అంకబాబును అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు విమర్శించారు. జగన్ రెడ్డి సూచనల మేరకు రాత్రి పూట అరెస్టు చేయడం సీఐడీకి అలవాటుగా మారిపోయిందని, అరెస్టుకు ముందు 41ఏ నోటీసులు ఇవ్వాలన్న బుద్ధి సీఐడీ అధికారులకు లేదా అని ప్రశ్నించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అర్థరాత్రిళ్లు అరెస్టు చేయడమేంటని నిలదీశారు.

మరోవైపు Vetaran Journalist Arrest ను జర్నలిస్ట్‌ సంఘాలు ఖండించాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసు ఇవ్వకుండా అంకబాబును అజ్ఞాతంలోకి తీసుకెళ్లటం దారుణమన్నారు. అంకబాబును తక్షణమే విడుదల చేయాలని, అంకబాబు ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఐజేయూ, ఏపీ డబ్ల్యుయూజేలు డిమాండ్ చేశాయి.

టాపిక్