తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /   Ycp Vs Brs : ఏపీకి రా, ఏంటో తెలుస్తుంది.. హరీశ్‌రావ్ కామెంట్స్ పై ఏపీ మంత్రులు ఫైర్

YCP vs BRS : ఏపీకి రా, ఏంటో తెలుస్తుంది.. హరీశ్‌రావ్ కామెంట్స్ పై ఏపీ మంత్రులు ఫైర్

HT Telugu Desk HT Telugu

12 April 2023, 18:32 IST

    • Minister Harish rao Comments On AP: మంత్రి హరీశ్ కామెంట్స్ పై ఏపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయ్ హరీశ్ రావ్ గారూ అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఫలితంగా మరోసారి వైసీపీ, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కు ఆజ్యం పడినట్లు అయింది.
మంత్రి హరీశ్ కామెంట్స్ పై వైసీపీ ఫైర్
మంత్రి హరీశ్ కామెంట్స్ పై వైసీపీ ఫైర్

మంత్రి హరీశ్ కామెంట్స్ పై వైసీపీ ఫైర్

AP Ministers Fires On Minister Harishrao: ఏపీని ఉద్దేశిస్తూ మంత్రి హరీశ్ రావ్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ మొదలైంది. దీనిపై రియాక్ట్ అవుతున్న వైసీపీ నేతలు....తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.... ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా..? అంటూ ప్రశ్నించారు. ఏపీకి వస్తే ఏం జరుగుతుందో కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు తేడా చూడాలంటూ హితవు పలికారు. హరీశ్ రావ్ గారూ.. ముందు మీ రాష్ట్రం(తెలంగాణ) సంగతి చూసుకో అంటూ కామెంట్స్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

APPSC Marks: ఏపీపీఎస్సీ టౌన్‌ ప్లానింగ్, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పరీక్షల మార్కుల విడుదల

ఇక మంత్రి హరీశ్ రావ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు బీఆర్ఎస్ అనేదే ప్రాంతీయ ఉన్మాదం మీద పుట్టిన పార్టీ అంటూ మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా టీఆర్ఎస్ ఏర్పాటైందన్నారు. హైదరాబాద్ లోని పెట్టుబడులన్నీ ఆంధ్రావాళ్లవే అని చెప్పారు. ఆ పెట్టుబడులతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో ఏ రోజు కూడా బీఆర్ఎస్ ఒప్పుకోలేదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మా హక్కు అని చెప్పారు. బీఆర్ఎస్ పెట్టి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే జాతీయ పార్టీ అయిపోతుందా..? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అనేది కుటుంబ పాలన చేయటానికి తెలంగాణ కాదు అంటూ ఘాటుగా మాట్లాడారు.

వివాదం ఇలా…

Minister Harish Rao Shocking Comments: ఏపీకి చెందినవారు తెలంగాణలో ఓట్లు తీసుకోవాలంటూ హరీశ్ రావ్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. సంగారెడ్డిలో మంగళవారం మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీని ఉద్దేశిస్తూ కొని వ్యాఖ్యలు చేశారు. అక్కడికి...ఇక్కడికి జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్ ఉందని చెప్పారు. అందుకే ఏపీలో ఓటు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని వారికి సూచించారు. దీంతో ఏపీ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఇవాళ మరోసారి స్పందించారు హరీశ్ రావ్.

తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని నిలదీశారు. తమ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందని... 56 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని చెప్పారు. రైతు బీమా, రైతు బంధు ఉందంటూ మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. తమ దగ్గర ఇవన్నీ ఉన్నాయంని...మీ దగ్గర ఏమున్నాయంటూ ఏపీ మంత్రులను ఎదురు ప్రశ్నించారు. "నా వ్యాఖ్యలపై స్పందించిన ఓ ఏపీ మంత్రి అంటుండు.. మీ తెలంగాణలో ఏం ఉందని ప్రశ్నించాడు. మా దగ్గర 56 లక్షల ఎకరాల యాసంగి పంట ఉంది మంత్రి గారు. ఆడపిల్లకు కల్యాణ లక్ష్మీ ఇస్తున్నాం. మా దగ్గర కేసీఆర్ కిట్ ఉంది మంత్రి గారు. ఏకరానికి పది వేలు ఇచ్చే రైతుబంధు ఉంది మంత్రి గారు. ఐదు లక్షలు ఇచ్చే రైతుబీమా కూడా ఉంది. 26 మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేశాం. ప్రపంచమే అబ్బురంపడేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడేళ్లలోనే పూర్తి చేశాం మంత్రిగారూ. మీ దగ్గర ఏం ఉంది మంత్రిగారూ..? విశాఖ ఉక్కుపై మాట్లాడరు. ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టిన ఏం అడగరు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మిన ఎవ్వరు అడగరు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. ప్రజలను గాలికి వదిలేశారు.. మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయి. అలాంటి మీరు మా జోలికి రాకండి. మా గురించి మాట్లాడకపతే అది మీకే మంచింది" అంటూ ఘాటుగా బదులిచ్చారు హరీశ్ రావ్.

తాజాగా హరీశ్ రావ్ కాస్త గట్టిగా బదులివ్వటంతో… ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు రీసౌండ్ పెంచారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు.