తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Hc On Passports: కేసులుంటే పాస్‌పోర్ట్ కుదరదు..కోర్టు అనుమతించాల్సిందే!

AP HC On Passports: కేసులుంటే పాస్‌పోర్ట్ కుదరదు..కోర్టు అనుమతించాల్సిందే!

HT Telugu Desk HT Telugu

23 March 2023, 11:54 IST

  • AP HC On Passports: క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారికి పాస్‌పోర్ట్‌ పునరుద్ధరించే విషయంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి న్యాయస్థానం నుంచి నిరభ్యంతర పత్రం పొందాల్సిందేనని తేల్చి చెప్పింది. 

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

AP HC On Passports: క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి ఇకపై పాస్‌పోర్ట్‌ రెన్యువల్ చేయించుకోవడం సులువేం కాదు. కోర్టుల అనుమతి లేకుండా పాస్‌పోర్ట్‌లు జారీ చేయొద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్న వారు, సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం సమర్పించకుండా పాస్‌పోర్టును పునరుద్ధరించుకునేలా పాస్‌పోర్టు కార్యాలయ అధికారులను ఆదేశించాలని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లు చేసిన అభ్యర్థన సహేతుకంగా లేవని తిరస్కరించింది.

ట్రయల్ కోర్టు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలు, అనుమతులను పరిశీలించిన తర్వాత పాస్‌పోర్టును పునరుద్ధరించాలని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులను హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులిచ్చాక కూడా కోర్టులో క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందనే ఒక్క కారణంతో పాస్‌పోర్టును పునరుద్ధరించకుండా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్‌ల పునరుద్ధరణ విషయంలో కోర్టు ఆదేశాల ప్రకారమే అధికారులు వ్యవహరించాలని తేల్చి చెప్పింది.

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పిటిషనర్లు, విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఎన్‌వోసీ కోసం క్రిమినల్‌ కోర్టులను ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. ఆయా కేసులోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులివ్వాలని ట్రయల్ కోర్టులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత కోర్టు నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలంటూ పాస్‌ పోర్టులను రెన్యువల్‌ చేయక పోవడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పాస్‌పోర్టు మొదటిసారి జారీచేసే సమయంలోనే క్రిమినల్‌ కేసులను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప రెన్యువల్‌ విషయంలో కాదని వాదించారు.

పాస్‌పోర్టు అధికారుల తరఫున కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పాస్‌పోర్టు చట్టం ప్రకారం క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉంటే పునరుద్ధరణను తిరస్కరించవచ్చన్నారు. దేశం విడిచి వెళ్లేందుకు అభ్యంతరం లేదని కోర్టు నుంచి ఎన్‌వోసీ తెస్తే పునరుద్ధరణను పరిశీలిస్తారన్నారు. ఇరుపక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి సంబంధిత కోర్టు నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుంటేనే పాస్‌పోర్టు రెన్యువల్‌ తిరస్కరణకు గురికాకుండా మినహాయింపు ఉందని ప్రకటించారు. పాస్‌పోర్టు మొదటిసారి జారీ చేసే విషయంలో ఉన్న నిబంధనలే రెన్యువల్‌ విషయంలోనూ ఉంటాయన్నారు.క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొన వారిపై కోర్టు నిరభ్యంత