తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Farmers : రైతులకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇకనుంచి ఆ సమస్య ఉండదు!

AP Farmers : రైతులకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇకనుంచి ఆ సమస్య ఉండదు!

15 November 2024, 18:28 IST

google News
    • AP Farmers : రాష్ట్రంలో ఖరీఫ్‌ కోతలు మొదలయ్యాయి. ముందుగా నాట్లు వేసిన పంటను కోసి ధాన్యం విక్రయించేస్తున్నారు. అయితే ఇంకా చాలామంది మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు సమర్పించలేదు. దీంతో మిల్లులు ఆన్‌లైన్‌ కాలేదు. ఈ నేపథ్యంలో కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
రైతులకు శుభవార్త
రైతులకు శుభవార్త

రైతులకు శుభవార్త

రాష్ట్రంలో ఇప్పటికే వరికోతలు ప్రారంభం అయ్యాయి. చాలామంది రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. అయితే ఇప్పుడు కేవలం ముందుగా నాట్లు వేసినవి మాత్రమే కోస్తున్నారు. ఆలస్యంగా వేసిన నాట్లు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ధాన్యం కొనుగోళ్లపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. అటు మిల్లర్లు బ్యాంక్ షూరిటీలు సమర్పించలేదు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్తం చెప్పింది.

'రైతులు ధాన్యం విక్రయించుకొనే విధానాన్ని సులభతరం చేస్తూ.. సంస్కరణలు తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. రైతులు తమ పంటను జిల్లాలో ఎక్కడైనా, ఏ రైస్ మిల్లుకైనా అమ్ముకొనే విధానాన్ని తీసుకువచ్చాము. మంచి ప్రభుత్వం.. రైతు మేలు కోరే ప్రభుత్వం' అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు.

గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు, మిల్లర్లు ఇబ్బందులు పడ్డారు. గత ఖరీఫ్‌లో వివిధ మిల్లులు ఎఫ్‌సీఐకి పంపించిన బియ్యాన్ని వెనక్కితీసుకుని.. వాటి స్థానంలో అంతే మొత్తాన్ని కొత్తవి పంపించాలని పలు మిల్లులకు నోటీసులు జారీ అయ్యాయి. పోర్టిఫైడ్‌ బియ్యం తయారీలో భాగంగా వినియోగించే కెర్నల్స్‌ నాణ్యతలేనివి వినియోగించారని.. మిల్లులకు చెందిన వందలాది టన్నుల బియ్యం వెనక్కి తీసుకుని మళ్లీ కొత్తవి పంపించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

అయితే.. ప్రభుత్వం పంపిణీ చేసిన కెర్నల్స్‌ను మాత్రమే తాము బియ్యంలో సూచించిన మోతాదులో కలిపి వినియోగిస్తామని, దానికి తమను ఎలా బాధ్యులను చేస్తారని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకోలేమని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకున్న ధాన్యాన్ని మరపట్టించి గోదాములకు తరలించాల్సి ఉంది.

ధాన్యం పట్టించినందుకు.. బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలి. ఒక్కో మిల్లు సామర్ధ్యాన్ని బట్టి కోటి రూపాయల నుంచి రూ.7 కోట్ల వరకు షూరిటీ ఇవ్వాలి. అయితే.. మిల్లులకు నోటీసులు జారీ చేయడం, ఎఫ్‌సీఐ నుంచి బియ్యం తీసుకుని కొత్తగా మళ్లీ పంపించే వరకు ధాన్యాన్ని పంపించ వద్దని చెప్పడంతో ఈ అంశం మిల్లర్స్‌ అసోసియేషన్‌కు చేరింది.

తమ సమస్య పరిష్కరించే వరకు బ్యాంకు గ్యారంటీలు చెల్లించ వద్దని నిర్ణయించుకోవడంతో మిల్లర్లు ఆలోచిస్తున్నారు. మిల్లర్లు షూరిటీ చెల్లిస్తే ఆన్‌లైన్‌ అవుతాయి. అప్పుడే కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం పంపించడానికి అవకాశం ఉంటుంది. అయితే.. కొందరు మిల్లర్లు షూరిటీ ఇచ్చారు. దీంతో రైతులు ఆ మిల్లులకు ధాన్యం తరలించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

తదుపరి వ్యాసం