తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ap Cm Ys Jagan Makes A Courtesy Call To New Governor Justice Abdul Nazeer At Rajbhavan

AP Rajbhavan: రాజ్ భవన్ కు సీఎం జగన్ దంపతులు.. కొత్త గవర్నర్ తో భేటీ

23 February 2023, 14:44 IST

CM Jagan Courtesy call to New Governor: నూతన గవర్నర్‌ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ దంపతులతో సీఎం జగన్ దంపతులు భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. మరోవైపు శుక్రవారం ఏపీ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేస్తారు.

  • CM Jagan Courtesy call to New Governor: నూతన గవర్నర్‌ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ దంపతులతో సీఎం జగన్ దంపతులు భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. మరోవైపు శుక్రవారం ఏపీ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేస్తారు.
కొత్త గవర్నర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్. 
(1 / 5)

గురువారం సీఎం జగన్ దంపతులు రాజ్ భవన్ కు వెళ్లారు. నూతన గవర్నర్ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ దంపతులతో భేటీ అయ్యారు.
(2 / 5)

నూతన గవర్నర్ సతీమణికి పుష్పగుచ్చం ఇస్తున్న సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డి.
(3 / 5)

రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన  అబ్దుల్‌ నజీర్‌కు బుధవారం ఏపీకి చేరుకున్నారు.రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా… వారికి ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలికారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను సీఎం జగన్‌ శాలువాతో సత్కరించారు. 
(4 / 5)

ఏపీకి మూడో గవర్నర్ గా రానున్న ఎస్ అబ్దుల్ నజీర్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించి.. ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ పొందారు. 1958 జనవరి 5న అప్పటి మైసూర్ రాష్ట్రం ( ప్రస్తుతం కర్ణాటక) బెలువాయిలో జన్మించిన ఆయన... ముడిబిద్రిలోని మహావీర్ కళాశాలలో బీకాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మంగళూరులోని కొడియాల్ బైల్ లోని ఎస్డీఎమ్ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి... కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. కర్ణాటక హైకోర్టులో సేవలు అందిస్తుండగానే ... పదోన్నతి పొంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేయకుండానే.. దేశ సరోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎంపికైన మూడో జడ్జగా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా... 2017, ఫిబ్రవరి 17 నుంచి 2023 జనవరి 4 వరకు సేవలు అందించారు. పలు కీలక కేసుల్లో తీర్పునిచ్చారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి