తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Telugu News Updates 25 February: తిరుమల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదల
తిరుమల
తిరుమల

Telugu News Updates 25 February: తిరుమల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదల

25 February 2023, 7:57 IST

  • తిరుమల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల టికెట్లు విడుదలయ్యాయి. రోజుకు 500 టికెట్ల చొప్పున శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. టికెట్లను పొందాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో 12 గంటలకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకునేందుకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.మరిన్ని తాజా వార్తల కోసం లైవ్ పేజీని రిఫ్రెష్ చేయండి…..

25 February 2023, 13:15 IST

పీఆర్సీ

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ)లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు విలీనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదోన్నతి పొందిన 2,096 మందికి పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి ఒకటి నుంచి పీటీడీలోకి విలీనం అయ్యారు. ఆ తర్వాత వీరిలో 2,096 మందికి ఆర్టీసీ యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ అనుమతి లేకుండా వీరికి ప్రమోషన్ ఇచ్చారని ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. వీరికి మినహా, మిగిలిన ఉద్యోగులకు గతేడాది సెప్టెంబరు నుంచి పీఆర్సీ అమలు చేశారు. ఆ తర్వా తఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఫలితంగా 2096 మంది ఉద్యోగులకు ఈ ఒక్కసారికి పీఆర్సీ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

25 February 2023, 13:09 IST

తీపికబురు

AP Govt Latest News: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో బీసీ,ఎస్పీ,ఎస్టీల మాదిరిగానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(EWS)కు వయోపరిమితిని ఐదేళ్లు పెంచారు.

25 February 2023, 11:48 IST

నోటీసులు

ప్రీతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదైంది. ప్రీతి కేసు పై ఉన్నతాధికారులకు నోటీసులు జారీచేసింది.

25 February 2023, 11:10 IST

యువకుడు మృతి

పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తాగిన మత్తులో హల్‌చల్‌ చేశాడు. వారు మందలిస్తే.. పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభం ఎక్కి తీగలు పట్టుకుని మృతి చెందాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

25 February 2023, 11:08 IST

ఆర్జీవీ క్వశ్చన్స్…

హైదరాబాద్‌ నగరంలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కక్కుల బెడద నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా విచారణ జరిపిన హైకోర్టు కూడా... ప్రభుత్వ చర్యలను ప్రశ్నించింది. ఇదిలా ఉంటే... ఈ ఘటన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. తన ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

25 February 2023, 10:05 IST

సైబర్ మోసం

సైబర్ మోసాలు.... ప్రపంచానికే అతిపెద్ద సవాల్. ఒక్కచోట అని కాదు... అన్ని చోట్ల ఈ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విద్యావంతులు కూడా ఈ మోసాల బారిన పడిపోతున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ... ఏదో ఒకలా ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నకిలీ సందేశాలకు స్పందించవద్దని చెబుతున్నప్పటికీ.. అలా చేస్తూ సైబర్ నేరగాళ్ల ఖజానా నింపుతున్నారు. ఇలా వందలు, వేలు కాదు.... లక్షల్లో కొట్టేస్తున్నారు. తాజాగా హన్మకొండ జిల్లా పరిధిలోనూ సైబర్ మోసం వెలుగు చూసింది.

25 February 2023, 10:05 IST

స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ ఈకే 528 విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 823 గ్రాముల బంగారు ముద్దను స్వాధీనం చేసుకున్నారు.

25 February 2023, 9:10 IST

గెయిల్ ప్రకటన

GAIL Recruitment 2023 : ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల అప్లికేషన్లకు ఆహ్వానించింది గెయిల్​ ఇండియా లిమిటెడ్​. అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టు అప్లికేషన్​కు తుది గడువు మార్చ్​ 15. అభ్యర్థులు గెయిల్​ అధికారిక వెబ్​సైట్​ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోవచ్చు.

25 February 2023, 8:51 IST

హత్య

కుటుంబం పరువు తీసిందన్న కోపంతో కన్న తండ్రే కుమార్తెను దారుణంగా హతమార్చిన సంఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

25 February 2023, 7:54 IST

భక్తులకు అలర్ట్… 

ఇవాళ తిరుమల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల టికెట్లు విడుదల కానున్నాయి. రోజుకు 500 టికెట్ల చొప్పున శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానున్నాయి. టికెట్లను పొందాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో 12 గంటలకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకునేందుకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.

25 February 2023, 7:51 IST

బంగారం ధరలు 

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 51,700కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 51,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 5,17,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,170గా ఉంది.

25 February 2023, 7:51 IST

లోకేశ్ కామెంట్స్ 

జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్నారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని చెప్పారు.

25 February 2023, 7:51 IST

షెడ్యూల్ విడుదల 

Telangana State Post Graduate Engineering Common Entrance Test 2023: టీఎస్ పీజీఈసెట్ షెడ్యూల్‌ వచ్చేసింది. శుక్రవారం హైద‌రాబాద్‌ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ(జెన్టీయూ) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2023-24 విద్యా సంవ‌త్స‌రానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు పూర్తి వివరాలను పేర్కొన్నారు. టీఎస్ పీజీఈసెట్‌ నోటిఫికేష‌న్ ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల అవుతుంది.

25 February 2023, 7:50 IST

ఆదేశాలు

cm jagan review on energy department: విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం... పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. వేసవిలో విద్యుత్‌ కొరత అనేది ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కావొద్దని చెప్పారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.

25 February 2023, 7:50 IST

కొత్త ప్యాకేజీ

దేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC)టూరిజం అందుబాటు ధరలలో ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఇందులో టూరిజం ప్రాంతాలే కాకుండా... అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ కు కొత్త ప్యాకేజీని ప్రకటించింది. SUNDAR SAURASHTRA పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్(AHMEDABAD ), ద్వారకా(Dwaraka), రాజ్‌కోట్, సోమనాథ్, వడోదరను సందర్శించొచ్చు. గుజరాత్ లోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొవచ్చు.

హైదరాబాద్(Hyderabad నుంచి రైలు ద్వారా ఈ టూర్ ఉంది. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 3, 2023న అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

    ఆర్టికల్ షేర్ చేయండి