తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Education : ఒకేసారి 21 మంది విద్యా శాఖ అధికారులు బ‌దిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

AP Education : ఒకేసారి 21 మంది విద్యా శాఖ అధికారులు బ‌దిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu

25 October 2024, 22:09 IST

google News
    • AP Education : రాష్ట్రంలో భారీగా విద్యా శాఖ అధికారులు బ‌దిలీ అయ్యారు. 21 మంది జిల్లా విద్యా అధికారులను బ‌దిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రోవైపు ఉపాధ్యాయ బ‌దిలీలు ప్ర‌క్రియ నిలిచిపోయింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.
21 మంది విద్యా శాఖ అధికారులు బ‌దిలీ
21 మంది విద్యా శాఖ అధికారులు బ‌దిలీ

21 మంది విద్యా శాఖ అధికారులు బ‌దిలీ

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా విద్యా శాఖ అధికారులు బ‌దిలీ అయ్యారు. 21 జిల్లాలకు సంబంధించి విద్యా శాఖ అధికారులను బ‌దిలీ చేస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వులు జారీ చేసింది. మ‌రోవైపు ఉపాధ్యాయ బ‌దిలీలు ప్ర‌క్రియ నిలిచిపోయింది. వైసీపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఉపాధ్యాయ బ‌దిలీల‌ను నిలిపివేసిన కూట‌మి ప్ర‌భుత్వం.. ఇంకా ఆ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌లేదు. ఉపాధ్యాయ బ‌దిలీల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయ బ‌దిలీలను వెంట‌నే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్ర‌భుత్వం జిల్లా విద్యా శాఖ అధికారుల బ‌దిలీల‌కు పచ్చ జెండా ఊపింది. దీంతో జిల్లా ల‌కు కొత్త విద్యా శాఖ అధికారులు రానున్నారు.

ఏ జిల్లాకు ఎవరు..

1. ఎన్.టి. నాయుడు – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), పార్వతీపురం మన్యం జిల్లా.

2. యు.మాణిక్యం నాయుడు – జిల్లా విద్యా అధికారి (డీఈవో), విజయనగరం.

3. ఎన్.ప్రేమ్ కుమార్ – జిల్లా విద్యా అధికారి (డీఈవో), విశాఖపట్నం.

4. జి.అప్పారావు నాయుడు – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), అనకాపల్లి.

5. సలీం బాషా – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.

6. ఎం. వేంకటలక్ష్మమ్మ – జిల్లా విద్యా అధికారి (డీఈవో), ఏలూరు.

7. ఈడ‌బ్ల్యూఎస్ఎస్ఎస్‌బీఎల్ నారాయణ – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), పశ్చిమ గోదావరి.

8. పీ.వీ.జే. రామరావు – జిల్లా విద్యా అధికారి (డీఈవో), కృష్ణా.

9. ఎల్. చంద్రకల – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), పల్నాడు.

10. సీ.వీ. రేణుక – జిల్లా విద్యా అధికారి (డీఈవో), గుంటూరు.

11. ఎస్. పురుషోత్తం – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), బాపట్ల.

12. ఎ. కిరణ్ కుమార్ – జిల్లా విద్యా అధికారి (డీఈవో), ప్రకాశం.

13. ఆర్. బాలాజీ రావు – జిల్లా విద్యా అధికారి (డీఈవో), నెల్లూరు.

14. కె.వి.ఎన్. కుమార్ – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), తిరుపతి.

15. బి. వరలక్ష్మి – జిల్లా విద్యా అధికారి (డీఈవో), చిత్తూరు.

16. కె. సుబ్రహ్మణ్యం – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), అన్నమయ్య.

17. యు. మీనాక్షి – జిల్లా విద్యా అధికారి (డీఈవో), వైఎస్ఆర్ జిల్లా.

18. జి. క్రిస్టప్ప – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), శ్రీ సత్యసాయి జిల్లా.

19. ఎం. ప్రసాద బాబు – జిల్లా విద్యా అధికారి (డీఈవో), అనంతపురం.

20. ఎస్. స్యామ్యూల్ పాల్ – జిల్లా విద్యా అధికారి (డీఈవో), కర్నూలు.

21. పి. జనార్ధన రెడ్డి – జిల్లా పాఠశాల విద్యా అధికారి (డీఎస్ఈవో), నంద్యాల

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం