AP Govt : స‌త్య‌సాయి, ఏలూరు జిల్లాల్లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలు-notification for recruitment of contract and outsourcing posts in satyasai and eluru districts in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt : స‌త్య‌సాయి, ఏలూరు జిల్లాల్లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలు

AP Govt : స‌త్య‌సాయి, ఏలూరు జిల్లాల్లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలు

HT Telugu Desk HT Telugu
Oct 02, 2024 05:43 PM IST

స‌త్య‌సాయి, ఏలూరు జిల్లాల్లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ పోస్టులు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.స‌త్య‌సాయి జిల్లాలో 14 పోస్టుల‌ు ఉండగా, ఏలూరు జిల్లాలో 8 ఖాళీలు ఉన్నాయి.

కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ పోస్టులు - నోటిఫికేషన్లు విడుదల
కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ పోస్టులు - నోటిఫికేషన్లు విడుదల (image source unspalash.com)

స‌త్య‌సాయి, ఏలూరు జిల్లాల‌ ప‌రిధిలోని మ‌హిళా, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యంలో ఖాళీగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అక్టోబ‌ర్ 8 ఆఖ‌రు తేదీ. ఆస‌క్తి గ‌ల వారు నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాల‌ని జిల్లా అధికారులు కోరుతున్నారు.

స‌త్య‌సాయి, ఏలూరు జిల్లాల్లో మహిళ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలోని డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీసీ), స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్ఏఏ), చిల్డ్ర‌న్ హోమ్స్‌లో ఖాళీగా ఉన్న22 ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆహ్వానించారు. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలో భ‌ర్తీ చేస్తారు. ప‌నితీరు ఆధారంగా వారి స‌ర్వీసును కొన‌సాగిస్తామ‌ని పేర్కొన్నారు.

ఇందులో అర్హులైన అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి నియామ‌కం జ‌రుపుతారు. ఈ ఉద్యోగాల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష, ఉద్యోగుల‌కు అప్లై చేయ‌డానికి ఎటువంటి ఫీజు ఉండ‌దు. పోస్టు బ‌ట్టీ ఏడో త‌ర‌గ‌తి, ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ విద్యార్హ‌త‌తో పాటు అనుభ‌వం అవ‌స‌రం ఉంటుంది.

స‌త్య‌సాయి జిల్లాలో 14 పోస్టుల‌ భ‌ర్తీ..

స‌త్య‌సాయి జిల్లాలో 14 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. స్టోర్ కీప‌ర్‌-2, కుక్‌- 1 , హెల్ప‌ర్ కం నైట్ వాచ్‌మెన్-1 , హౌస్ కీప‌ర్‌- 2, ఎడ్యుకేట‌ర్- 2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచ‌ర్‌- 4, పీటీ ఇన్ట్స్ర‌క్ట‌ర్ కం యోగ టీచ‌ర్‌- 2 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులు హిందూపురం, ధ‌ర్మ‌వ‌రం చిల్డ్ర‌న్ హోంల్లో ఉన్నాయి.

ఏలూరు జిల్లాలో 8 పోస్టులు..

ఏలూరు జిల్లాలో ఎనిమిది పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్ష‌న్ ఆఫీస‌ర్ నాన్ ఇన్స్టిట్యూష‌నల్ కేర్‌- 1, సోష‌ల్ వ‌ర్క‌ర్ -1, డాక్ట‌ర్ -1, ఆయా -1, ఎడ్యుకేట‌ర్- 1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచ‌ర్‌- 2, పీటీ ఇన్ట్స్ర‌క్ట‌ర్ కం యోగ టీచ‌ర్‌- 1 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

వేత‌నం...వయో పరిమితి

డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్ష‌న్ ఆఫీస‌ర్‌- రూ.27804, సోష‌ల్ వ‌ర్క‌ర్ కం ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేట‌ర్‌-రూ.18,536, డాక్ట‌ర్ (పార్ట్‌టైం)- రూ.9,930, ఆయా- రూ.7,944, స్టోర్ కీప‌ర్ కం అకౌంటెంట్ - రూ. 18,536, కుక్‌- రూ.9,930, హెల్ప‌ర్ కం నైట్ వాచ్‌మెన్- రూ.7,944, హౌస్ కీప‌ర్‌- రూ.7,944, ఎడ్యుకేట‌ర్- రూ.10,000, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచ‌ర్‌- రూ.10,000, పీటీ ఇన్ట్స్ర‌క్ట‌ర్ కం యోగ టీచ‌ర్‌- రూ.10,000 నెల‌వారీ వేత‌నం ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసే అభ్య‌ర్థుల వ‌యో ప‌రిమితి 2024 జులై 1 నాటికి 25 నుండి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్‌ల‌కు ఐదేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు సడలింపు కూడా వర్తిస్తుంది. డాక్ట‌ర్ పోస్టుకు ఎటువంటి వ‌యోప‌రిమితి లేదు.

స‌త్య‌సాయి జిల్లాకు సంబంధించిన‌ పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/satya-child01-10-24.pdf ను క్లిక్ చేయండి. అందులో అప్లికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకుని, ఖాళీల‌ను పూర్తి చేసి సంబంధిత స‌ర్టిఫికేట్ల‌ను జ‌త‌చేసి, అక్టోబ‌ర్ 8 సాయంత్రం 5 గంట‌ల లోపు ఆయా జిల్లా మ‌హిళా మ‌రియు శిశు సంక్షేమ‌, సాధికార‌త అధికారి, జిల్లా కార్యాల‌యాలం పుట్ట‌ప‌ర్తి, స‌త్య‌సాయి జిల్లాలో అంద‌జేయాలి.

ఏలూరు జిల్లాకు సంబంధించి పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3eccbc87e4b5ce2fe28308fd9f2a7baf3/uploads/2024/09/2024093052.pdf క్లిక్ చేస్తూ మ‌రిన్ని వివ‌రాలు అందుబాట‌లో ఉన్నాయి. అయితే ఏలూరు జిల్లాకు సంబంధించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను http://117.216.209.136/icdsrect2024/ క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం