Online Fraud: నంద్యాల జిల్లాలో విషాదం, ఆన్‌లైన్ మోసానికి ప్ర‌భుత్వఉపాధ్యాయుడి బలి, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య-tragedy in nandyal district govt teacher dies of online fraud commits suicide by taking selfie video ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Online Fraud: నంద్యాల జిల్లాలో విషాదం, ఆన్‌లైన్ మోసానికి ప్ర‌భుత్వఉపాధ్యాయుడి బలి, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య

Online Fraud: నంద్యాల జిల్లాలో విషాదం, ఆన్‌లైన్ మోసానికి ప్ర‌భుత్వఉపాధ్యాయుడి బలి, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య

HT Telugu Desk HT Telugu
Sep 19, 2024 08:56 AM IST

Online Fraud: నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ మోసానికి ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు బ‌లి అయ్యాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెట్టుబ‌డులు పెడితే అధిక లాభాలు వ‌స్తాయ‌ని న‌మ్మి మోస‌పోయారు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

ఆన్‌లైన్‌ మోసంతో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య
ఆన్‌లైన్‌ మోసంతో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

Online Fraud: నంద్యాల ప‌ట్ట‌ణంలోని స‌లీమ్ న‌గ‌ర్‌కు చెందిన సయ్య‌ద్ ఖ‌లీల్ అహ్మ‌ద్ (20) అవుకు మండ‌లం సంగ‌ప‌ట్నం జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఉపాధ్యాయునిగా ప‌ని చేస్తున్నారు. ముంబాయికి చెందిన టైటాన్ ఎఫ్ఎక్స్.యుకే అనే ఆటో ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెట్టుబ‌డులు పెడితే, కేవ‌లం 10 శాతం క‌మిష‌న్ తీసుకుని అధిక లాభాలు వ‌స్తాయ‌ని, బోన‌స్ కూడా ఇస్తామ‌ని అహ్మద్‌కు ఒక ఆన్‌లైన్ మోస‌గాడు విశాల్ న‌మ్మ‌బ‌లికాడు.

అంతేకాకుండా మీరు మీ ప‌నులు చేసుకుంటూనే లాభాలు పొంద‌వ‌చ్చ‌ని అహ్మ‌ద్ భార్య ష‌స్త్రక్ రిజ్వానా పేరు మీద టైటాన్ ఎఫ్ఎక్స్.యుకే కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేయించాడు. వేరేవాళ్ల‌ ఆ అకౌంట్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను పంపించి, వాళ్ల లాభాల‌ను చూపించి మాయ మాట‌లు చెప్పాడు. అది నిజ‌మ‌ని అహ్మ‌ద్ న‌మ్మాడు. దీంతో అహ్మ‌ద్‌తో రూ.1.50 ల‌క్ష‌లు కంపెనీలో వేయించాడు. దాదాపు రూ.ఏడు ల‌క్ష‌ల న‌ష్టం వ‌చ్చిందని, ఇంకా రూ.1.50 ల‌క్ష‌లు వేయ‌మ‌ని చెప్పాడు. అందుకు అహ్మ‌ద్ వేయ‌లేదు.

కానీ అదే కంపెనీ నుంచి వైభ‌వ్ అనే అత‌ను ఫోన్ చేసి ఇలా న‌ష్టంలో ఉంటే మీకే స‌మ‌స్య అవుతుంద‌ని, ఐటీ నుంచి నోటీస‌లు వ‌స్తాయ‌ని చెప్పి మ‌ర‌ల సెప్టెంబ‌ర్ 5న‌ రూ.50 వేలు కంటించాడు. సెప్టెంబ‌ర్ 6న అహ్మ‌ద్‌కు వ‌చ్చి మొత్తం లాభం 8,908 డాల‌ర్లు (దాదాపు రూ.7.50 ల‌క్ష‌లు) న‌గ‌దు విత్ డ్రా చేయించాడు.

కానీ మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి విత్ డ్రా రావాలంటే, మీరు టీడీఎస్ క‌ట్టాల‌ని, 18 శాతం (రూ.75 వేలు) క‌ట్టించాడు. అది స‌రిపోవ‌టం లేద‌ని మ‌ర‌లా టీడీఎస్ కోసమ‌ని రూ.60 వేలు క‌ట్టించాడు. స్టాఫ్ట్‌వేర్ ఫీజు అని రూ.75వేలు, లేట్ పెనాల్టీ ఛార్జ్‌స్ అని రూ.44,900 క‌ట్టించుకున్నాడు. చెక్ బౌన్స్ అయింద‌ని మ‌ళ్లీ రూ.44 వేలు క‌ట్టించుకున్నాడు.

పేమెంట్ లేట్ అయినందుకు ఫైల్ మూ చేయ‌డానికి రూ.50 వేలు క‌ట్టించుకున్నాడు. విత్‌డ్రా తొంద‌ర‌గా రాకుంటే ఇలానే పెనాల్టీ ప‌డతాయ‌ని అహ్మ‌ద్ ఎంత డ‌బ్బులు క‌ట్ట‌మంటే అంత ఒత్తిడిలో క‌ట్టేసేవాడు. ఇలా సెప్టెంబ‌ర్ 11 వ‌ర‌కు డ‌బ్బులు క‌ట్టించుకుని విత్‌డ్రా చేయిస్తాన‌ని సాకులు చెబుతూ వ‌చ్చాడు.

కానీ సెప్టెంబ‌ర్ 12న మ‌రొక సాకు చూపించి విత్‌డ్రా కాద‌ని అహ్మ‌ద్‌కు చెప్పాడు. ఆ కంపెనీ నుంచి రావ‌ల్సిన 11,857 డాల‌ర్లు (రూ.10 ల‌క్ష‌లు) ఇప్పించాల‌ని కోరారు. ఆ ఆన్‌లైన్ మోస‌గాడు మ‌ళ్లీ ఖలీల్ అహ్మ‌ద్‌కు ఫోన్ చేసి ప్ర‌స్తుతం కంపెనీ న‌ష్టాల్లో ఉంద‌ని, ఐటీ దాడులు జ‌రుగుతున్నాయ‌ని, మ‌రింత న‌గ‌దు పంపాల‌ని ప‌దేప‌దే ఒత్తిడి చేశాడు.

తాను పోస‌పోయాన‌ని తెలుసుకొని ఆ ఒత్తిడిని త‌ట్టుకోలేక సెల్ఫీ వీడియో తీస్తూ త‌న ఇంట్లోనే మంగ‌ళ‌వారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉపాధ్యాయుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. విష‌యం తెలుసుకున్న టూ టౌన్ సీఐ ఇస్మాయిల్ సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అహ్మ‌ద్‌కు భార్య‌తో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు సీఐ ఇస్మాయిల్ తెలిపారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)