తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Bjp President Comments On Political Alliances With Tdp And Ysrcp In Ap

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు….సోము వీర్రాజు…

HT Telugu Desk HT Telugu

08 February 2023, 13:06 IST

    • MLC Elections   ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఏపీలోని  3 ప్రాంతాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  కుటుంబ రాజకీయ పార్టీలతో పొత్తులకు బీజేపీ దూరంగా ఉంటుందన్నారు. 
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

MLC Elections ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : మే నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే

AP Heat Wave : చాగలమర్రిలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు-రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు

AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై సోము వీర్రాజు మరోసారి హాట్ కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడిన సోము వీర్రాజు "ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయం కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకున్నందున పార్లమెంట్ సాక్షిగా 15 వేల కోట్లు ఇచ్చారని, మరికొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు.

ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభ వేదికగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని నిలదీసిన నేపథ్యంలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి బీజేపీ తీరును తప్పు పట్టారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ కూడా మర్చిపోయిందని విమర్శించారు. దీనికి స్పందించిన సోము వీర్రాజు ప్రత్యేక హోదా స్థానంలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని గుర్తు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలోని 3 ప్రాంతాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత బీజేపీదేనని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయం కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి గతంలోనే చంద్రబాబు హయాంలోనే పార్లమెంట్ సాక్షిగా 15 వేల కోట్లు ఇచ్చామని.. ఇంకా కొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అడిగితే ఆ డబ్బులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

ఏపీలో పొత్తులపై కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. జనసేనతో మాత్రమే ఏపీలో బీజేపీకి పొత్తు ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ చంద్రబాబుతో మాత్రం కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బీజేపీ వాళ్ళ ఫోన్లు టాపరింగ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో రాజధాని కడతామని చంద్రబాబు, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కుటుంబ రాజకీయ పార్టీలు అయిన వైసీపీ, టీడీపీలతో తాము పొత్తు పెట్టుకోమని ప్రకటించారు.

టాపిక్