తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  09 March Telugu News Updates | కరీంనగర్ లో కాంగ్రెస్ కవాతు సభ
కరీంనగర్ కవాత్తు
కరీంనగర్ కవాత్తు

09 March Telugu News Updates | కరీంనగర్ లో కాంగ్రెస్ కవాతు సభ

09 March 2023, 21:55 IST

  • కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కాంగ్రెస్ కవాతు సభ మొదలైంది. ఈ సభకు ఆ పార్టీ శ్రేణలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు… బీఆర్ఎస్ , బీజేపీ ప్రభుత్వాలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 

09 March 2023, 21:55 IST

దీక్షకు గ్రీన్ సిగ్నల్

 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. సాంకేతిక కారణాలతో పర్మిషన్‌ రద్దు చేస్తున్నట్లు పోలీసులు ఈ మధ్యాహ్నం కవితకు సమాచారం అందించగా.. జాగృతి సంస్థ ప్రతినిధులు పోలీసులతో సంప్రదింపులు జరిపారు. చర్చల అనంతరం బీఆర్‌ఎస్‌ దీక్షకు పోలీసులు ఓకే చెప్పారు.

09 March 2023, 21:09 IST

బీజేపీ దీక్షలు

కవిత (MLC Kavitha) దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు భాజపా (BJP) సిద్ధమైంది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపడుతుండగా.. ఆమెకు ధీటుగా హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు.

09 March 2023, 19:48 IST

సభ

కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కాంగ్రెస్ కవాతు సభ మొదలైంది. ఈ సభకు ఆ పార్టీ శ్రేణలు భారీగా హాజరయ్యారు. ఈ సభకు ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

09 March 2023, 19:43 IST

ముగిసిన భేటీ.. 

తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సొంత జాగ ఉన్నవారు ఇళ్లు కట్టుకునేందుకు గృహ లక్ష్మీ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద నియోజకవర్గానికి 3వేల ఇండ్లను మంజూరు చేయనున్నారు. వీటితో పాటు దళితబంధు, పోడు భూముల పట్టాలతో పాటు పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రి హరీశ్ రావ్ వెల్లడించారు.

09 March 2023, 19:14 IST

రిలీజ్ విడుదల

తెలంగాణలో ఒక్కొక్క ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా పీఈసెట్ 2023 షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్. లింబాద్రితో కలిసి టీఎస్ పీఈసెట్ క‌న్వీన‌ర్, ప్రొఫెస‌ర్ ఎస్ మల్లేశ్‌ గురువారం విడుదల చేశారు.

09 March 2023, 17:46 IST

రిట్ పిటిషన్ 

వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. తన విచారణపై స్టే విదించాలని కోరారు. సీబీఐ తనను విచారించే సమయంలో.. ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని పిటిషన్ లో ప్రస్తావించారు. పలుమార్లు కోరినా సీబీఐ తన అభ్యర్ధనను అంగీకరించలేదని పేర్కొన్నారు.

09 March 2023, 17:26 IST

నోటిఫికేషన్… 

తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే కీలకమైన నోటిఫికేషన్లు రాగా... పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ అవుతున్నాయి. తాజాగా వైద్యారోగ్యశాఖ నుంచి మరో ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా... మొత్తం 11 రేడియోగ్రాఫర్ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టునున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు

09 March 2023, 16:02 IST

సీఎంసమీక్ష…

విజయవాడ స్వరాజ్‌ మైదానంలో తలపెట్టిన అంబేద్కర్‌ స్మృతివనం, అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులపై సమీక్షించారు సీఎం జగన్. పనుల పురోగతిపై అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. సివిల్‌ వర్క్స్, సుందరీకరణ పనులపై కూడా సీఎం సమీక్షించారు.స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అన్ని స్లాబ్‌ వర్కులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయని చెప్పారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని ముఖ్యమంత్రికి తెలిపారు. విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు... ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పుకొచ్చారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను సీఎంకు క్లుప్తంగా వివరించారు.

09 March 2023, 15:35 IST

షాక్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చివరి నిమిషంలో షాక్ ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో మార్చి 11వ తేదీన ఢిల్లీ వేదికగా దీక్ష చేయనున్నారు. అయితే కవిత తలపెట్టిన నిరసన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. లిక్కర్ కేసుపై శుక్రవారం మీడియాతో కవిత మాట్లాడుతుండగానే... సాంకేతిక కారణాలతో అనుమతి నిరాకరించినట్లు పోలీసులు సమాచారం అందించారు.

09 March 2023, 14:42 IST

కేబినెట్ భేటీ ప్రారంభం 

 

మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్​ అధ్యక్షతన ఈ సమావేశం జరగుతుంది. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ మినహా మిగిలిన అందరూ హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

 

09 March 2023, 14:41 IST

కవిత కామెంట్స్ 

విచార‌ణ‌కు వంద‌ శాతం స‌హ‌క‌రిస్తాను.. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వ‌చ్చి, విచార‌ణ ఎదుర్కొంటాన‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె… మ వైపు స‌త్యం, ధ‌ర్మం, న్యాయం ఉంది. ఏ విచార‌ణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం అని చెప్పారు.

09 March 2023, 14:40 IST

మరో రెండు ఆఫర్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను ఇప్పటికే అందజేస్తోన్న సంస్థ.. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ లోని బస్ భవన్ లో గురువారం టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ టికెట్లు శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.

09 March 2023, 14:40 IST

కోర్సు 

RK Math Offered Offline meditation course: హైదరాబాద్ లోని రామకృష్ణ మఠ్‌ మరో కోర్సును తీసుకువచ్చింది. ఆఫ్ లైన్ విధానంలో మెడిటేషన్ కోర్సును ప్రకటించింది. 16 - నుంచి 35 ఏళ్ల మధ్య ఉండే వారు మాత్రమే ఈ కోర్సు తీసుకునేందుకు అర్హులను ప్రకటించింది. ఈ మేరకు కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓ ప్రకటనలో వివరించింది.

09 March 2023, 13:09 IST

స్కిల్ డెవలప్‍మెంట్‍లో అక్రమాల కేసు విచారణ

 స్కిల్ డెవలప్‍మెంట్‍లో అక్రమాల కేసులో విచారణ జరుగుతోంది.  సీఐడీ విచారణకు  మాజీ ఐఆర్టీఎస్ ఆర్జా శ్రీకాంత్ హాజరయ్యారు.  నిన్న నొయిడాలో అరెస్టైయిన భాస్కర్‌ను  విజయవాడ తరలించారు.  ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం భాస్కర్‍ను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. 

09 March 2023, 12:37 IST

గౌతమ్ అదానీ ఎవరి బినామి…కేటీఆర్

గౌతమ్ అదానీ విషయంలో హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చినా  పిఎం, ఆర్ధిక మంత్రి బయటకు రారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చిన్న పిల్లల్ని అదానీ ఎవరని అడిగినా ఎవరి బినామినో చెబుతారన్నారు. బినామిలను కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని విమర్శించారు.  గౌతమ్ అదానీకి ఆరు ఎయిర్ పోర్టుల్ని ఇవ్వడంపై ఆర్ధిక శాఖ, నీతి ఆయోగ్ అభ్యంతరం ఇచ్చినా  కేటాయింపులు ఆగలేదన్నారు.  దేశాన్ని భ్రష్టు పట్టించే అదానీపై ఎలాంటి కేసులు ఉండవన్నారు. 13లక్షల  కోట్ల సంపద  ఆవిరైనా ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అదానీ పోర్టుల్లో 21వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు హెరాయిన్ దొరికినా ఎందుకు  చర్యలు లేవని ప్రశ్నించారు. 

09 March 2023, 12:09 IST

మహారాష్ట్ర లో బీఆర్ఎస్ కు పెరుగుతున్న మద్దతు.

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు పెరుగుతోంది. గులాబీ పార్టీకి రైతులు, యువత జై కొడుతున్నారు.  తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు మహారాష్ట్ర లో అమలు చేయాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని  మరాఠీ లు కోరుతున్నారు. కేసీఆర్ అండగా ఉందాం.... తెలంగాణ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసుకుందాం అంటూ పిలుపునిస్తున్నారు. మహారాష్ట్ర కిసాన్ అధ్యక్షుడు మానిక్ ఖడం ఆధ్వర్యంలో ఫర్బాని జిల్లా లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో రైతులు, వివిధ పార్టీల నాయకులు చేరుతున్నారు. 

09 March 2023, 11:30 IST

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ

గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు. ఇదే సమావేశంలో మంత్రివర్గ సిఫార్సుపై గవర్నర్‌ ఆమోదించే రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.  ఇళ్లు, ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీపై చర్చించే అవకాశం ఉంది.

09 March 2023, 11:05 IST

బీఫారంలు అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు

తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఎమ్మెల్సీ అభ్యర్దులు బీఫారంలు అందుకున్నారు. మరికాసేపట్లో శాసనసభా ప్రాంగణంలో ఏడుగురు అభ్యర్దులు నామినేషన్లు వేయనున్నారు. 

09 March 2023, 10:46 IST

చిత్తూరులో వడ్డీ వ్యాపారుల ఆగడాలు

చిత్తూరులో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతి మించాయి.  వడ్డీ కట్టలేదని వ్యాపారులు ఇంటికి తాళం వేశారు.  వ్యాపారుల వేధింపులపై  ఎస్పీకి ఎందుకు ఫిర్యాదు చేశారంటూ వేధించారు.  అవమానంతో  తల్లి పర్వీన్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో  ముగ్గురు పిల్లలు పోలీసులను ఆశ్రయించారు.  కాల్‍మనీ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు.  వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. చిత్తూరులోని పీరాన్ సాహెబ్ స్ట్రీట్‌లో ఘటన జరిగింది. 

09 March 2023, 10:07 IST

తిరుమలలో భర్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  ఉచిత దర్శనం కోసం 07 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  సర్వదర్శనం భక్తులకు 16 గంటల సమయం పడుతుంది. 300 రూ..శీఘ్రదర్శనంకు 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 04 నుండి 05 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 61,921 మంది దర్శించుకున్నారు.  23,141 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. బుధవారం స్వామి వారి హుండీ ఆదాయం 3.68 కోట్లు  లభించింది. 

09 March 2023, 10:05 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని సిపిఐ ఆరోపిస్తోంది.  రూ.కోట్లు ఖర్చు పెట్టైనా గెలవాలని వైసీపీ చూస్తోందని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.  పీడీఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు, టీడీపీ అభ్యర్థులకు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. 

09 March 2023, 10:04 IST

నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు 

నేడు ఏపీలో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు వేయనున్నారు.  సీఎంను కలిసి బీఫాంలను తీసుకోనున్నారు. ఏడుగురు వైసీపీ అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనున్నారు. 

09 March 2023, 10:03 IST

39వ రోజుకు చేరిన నారా లోకేష్ పాదయాత్ర

అన్నమయ్య జిల్లాలో  టీడీపీ  ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 39వ రోజుకు చేరింది.  పూలవాండ్లపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. నేడు మదనపల్లి నియోజకవర్గంలో యాత్ర  కొనసాగనుంది. వెంకటప్పకొండలో టిడ్కో ఇళ్ల బాధిత లబ్ధిదారులతో లోకేశ్ భేటీ అవుతారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి