తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh And Telangana Telugu Live News Updates 07 February 2023
గోదావరి వరదలతో  పోలవరం నిర్మాణంలో జాప్యం
గోదావరి వరదలతో పోలవరం నిర్మాణంలో జాప్యం (HT)

Telugu News Updates 07 February : గడువులోగా పోలవరం నిర్మాణం కష్టమే….

07 February 2023, 13:29 IST

  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోగా పూర్తి చేయడం కష్టమేనని పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. 2020, 2022లో వచ్చిన వరదల కారణంగా  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేమని  తెలిపారు. 2024లోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా వరదల కారణంగా పనుల్లో జాప్యం జరిగినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.13,226కోట్ల రుపాయలు కేంద్రం విడుదల చేసిందని  మరో రూ.2,390 కోట్ల రుపాయలు విడుదల చేయాల్సి ఉందని తెలిపారు.  పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే విద్యుత్ కేంద్రానికి కేంద్రం నిధులు ఇవ్వదని తేల్చి చెప్పారు. 

07 February 2023, 13:29 IST

కోటంరెడ్డికి  వైసీపీ కార్పొరేటర్ల ఝలక్

కోటంరెడ్డికి నెల్లూరు కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. ఎంపీ ఆదాల ప్రభాకర్‍రెడ్డిని  18 మంది కార్పొరేటర్లు కలిశారు. వీరిలో ఎక్స్ అఫిషియో మెంబర్లు కూడా ఉన్నారు. దీంతో  ఇద్దరు కార్పొరేటర్లకే  కోటంరెడ్డి బలం పరిమితమైంది. గతంలో కార్పొరేటర్లు తనను కలవలేని పరిస్థితి ఉందని,  ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని,  కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఆదాల చెప్పారు. ఎవరి పరిధిలోని సమస్యలను వారు పరిష్కరించుకోవచ్చన్నారు.  పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించమని  ఎంపీ ఆదాల ప్రభాకర్‍రెడ్డి హెచ్చరించారు. 

07 February 2023, 13:19 IST

అప్పు రత్న అంటూ ట్వీట్

అప్పురత్న అంటూ ఏపీ సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.  అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.  మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దని సూచించిన పవన్, రాష్ట్ర సంపద, భవిష్యత్‌ను గాలికొదిలేసి మీ సంపద పెంచుకోవాలన్నారు. 

07 February 2023, 13:18 IST

ఏక సభ్య కమిషన్ విచారణ

కందుకూరు తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారణ  ప్రారంభించింది.  జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ ముందు  ఇంటూరు రాజేశ్, ఇంటూరి నాగేశ్వరరావు - విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కమిషన్ కందుకూరు తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారణ - జస్టిస్ శేష శయనారెడ్డి కమిషన్ ముందు విచారణకు హాజరైన ఇంటూరు రాజేశ్, ఇంటూరి నాగేశ్వరరావు  విచారణ అనంతరం కమిషన్  ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 

07 February 2023, 13:17 IST

భద్రతపై కోర్టును ఆశ్రయించిన పయ్యావుల

భద్రత తొలగింపుపై ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పయ్యావుల సవాల్ చేశారు.  కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. - తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేశారు. 

07 February 2023, 12:05 IST

ఎమ్మెల్యేలకు  ఎర కేసులో లంచ్ మోషన్

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సింగల్ బెంచ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు పది రోజుల గడువు కోరుతూ ఎస్‌ఎల్‌పి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై  మద్యాహ్నం  హైకోర్టు విచారణ జరుపనుంది

07 February 2023, 11:05 IST

దుర్గ గుడి పాలకమండలి

15 మందితో దుర్గగుడి పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దుర్గగుడి పాలకమండలి సభ్యులుగా కర్నాటి రాంబాబు, కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కల్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, కొలుకులూరి రామసీత, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, వేదకుమారిలను నియమించారు. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. 

07 February 2023, 10:03 IST

గుంటూరులో బోరుగడ్డ అనిల్‌ కార్యలాయానికి నిప్పు

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిని బెదిరించిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు కార్యాలయం దగ్ధమైంది.  గుంటూరు డొంక రోడ్డులో బోరుగడ్డ అనిల్ ఆఫీస్‍కి నిప్పు పెట్టారు.  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు దాడి చేశారని  అనిల్ ఆరోపిస్తున్నారు. నక్కా ఆనంద్‍బాబు సూత్రధారి అని, ఆయన అనుచరులు పాత్రధారులని ఫిర్యాదు  చేశారు.  కోటంరెడ్డి, టీడీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెబుతున్న అనిల్,  తనకు న్యాయంతోపాటు రక్షణ కల్పించాలని కోరారు. 

07 February 2023, 10:00 IST

ఆలయాల్లో ధర్మకర్తలుగా నాయిబ్రాహ్మణులు

 ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆలయ పాలకవర్గాల్లో ధర్మకర్తలుగా నాయీ బ్రాహ్మణులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.  రాష్ట్రంలోని 610 ఆలయాలకు పాలకవర్గాలను నియమించనున్న ప్రభుత్వం వీటన్నింటిలో నాయీ బ్రాహ్మణుల నుంచి ఒకరు చొప్పున సభ్యుడిగా చేర్చాలని పేర్కొంది. 

07 February 2023, 9:59 IST

కందుకూరు ఘటనపై విచారణ

కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో జరిగిన  తొక్కిసలాటపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నేడు విచారణ జరుపనుంది. విజయవాడలో జస్టిస్ శేషసాయిన రెడ్డి తొక్కిసలాటపై విచారణ జరుపనున్నారు. 

07 February 2023, 9:58 IST

కాటేజీ డోనేషన్లకు స్పందన

తిరుమలలో కాటేజీ డొనేషన్ స్కీంకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.  తొమ్మిది కాటేజీలకు డోనార్స్ స్కీం కింద  టీటీడీ టీటీడీ టెండర్లను పిలిచింది.  HDVC 496 కాటేజీకి రూ.22 కోట్లకు టీటీడీ సభ్యుడు జీవన్ రెడ్డి టెండర్ దాఖలు చేశారు.  మిగిలిన కాటేజీలకు భారీ మొత్తంలో దాతలు టెండర్లు వేశారు.  తొమ్మిది కాటేజీల టెండర్ల ద్వారా టీటీడీకి రూ.75 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. 

07 February 2023, 9:56 IST

హరిరామ జోగయ్య పిటిషన్‌పై విచారణ

కాపులకు రిజర్వేషన్ కల్పించాలని మాజీ మంత్రి  హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్‍పై నేడు  హైకోర్టు విచారణ జరుగనుంది.  ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి