తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dsc Tet Exams : ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చండి, హైకోర్టు కీలక ఆదేశాలు

AP DSC TET Exams : ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చండి, హైకోర్టు కీలక ఆదేశాలు

04 March 2024, 16:27 IST

google News
    • AP DSC TET Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల మధ్య నాలుగు వారాల గడువు ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చండి- హైకోర్టు
ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చండి- హైకోర్టు

ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చండి- హైకోర్టు

AP DSC TET Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పరీక్షల(AP DSC TET Exams) నిర్వహణపై హైకోర్టు(High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. రాత పరీక్ష అనంతరం కీ పై అభ్యంతరాలు స్వీకరణలు సమయం ఇవ్వాలని తెలిపింది. మార్చి 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన డీఎస్సీ షెడ్యూల్‌ను(DSC Exam Schedule) హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏపీ టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తాయని, మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెడుతున్నారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు... టెట్, డీఎస్సీ పరీక్ష మధ్య నాలుగు వారాల గడువు ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర హైకోర్టు వాదనలు వినిపించారు.

టెట్, టీఆర్టీ మధ్య తగిన గడువు

ఏపీ టెట్, టీఆర్టీ పరీక్షల(TRT) మధ్య తగిన గడువు ఉండాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్ల గత బుధవారం వాదనలు ముగియగా.. న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పు రిజర్వు చేశారు. తాజా ఇవాళ తీర్పు వెలువరించారు. టెట్, టీఆర్టీ మధ్య తగిన గడువు ఉండాలని, ఆ విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్దిరాజు, మరో నలుగురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి, తగిన గడువు ఉండేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఏపీలో ప్రస్తుతం టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెట్ పరీక్షలు(AP TET Exams) ముగిసిన వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీంతో ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయంలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై వాదనలు ఉన్న హైకోర్టు...టెట్, టీఆర్టీ మధ్య నాలుగు వారాలు గడువు ఉండేలా పరీక్షలు షెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కొనసాగుతున్న టెట్ పరీక్షలు

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెట్ ప్రాథమిక కీ (AP TET Key)మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు. టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్‌ చేస్తారు. మార్చి 14న టెట్‌ తుది ఫలితాలు(TET Results) విడుదల చేస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్‌, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహించనున్నారు. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణాలో మూడు, కర్ణాటకలో నాలుగు, తమిళనాడులో రెండు, ఒడిశా రాష్ట్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌(AP DSC) విడుదలైన విషయం తెలిసిందే. డీఎస్సీ పరీక్షలను మార్చి 15 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ షెడ్యూల్ లో మార్పులు చేసే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం