AP DSC Notification : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
AP DSC Notification : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయనున్నారు.
AP DSC Notification : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ(SGT) , 1264 టీజీటీ(TGT), 215 పీజీటీ(PGT), 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్లు ప్రారంభం- ఫిబ్రవరి 12
- ఫీజులు చెల్లింపునకు చివరి తేదీ - ఫిబ్రవరి 21
- అప్లికేషన్లు సబ్మిట్ కు చివరి తేదీ - ఫిబ్రవరి 22
- హాల్ టికెట్స్ డౌన్ లోడ్- మార్చి 5 నుంచి
- పరీక్షలు నిర్వహణ- మార్చి 15 నుంచి 30 వరకు
- పరీక్ష ఫలితాలు - ఏప్రిల్ 7న
2018 డీఎస్సీ ప్రాసెస్ లోనే పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 15 నుంచి మార్చి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రెండు సెషన్స్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. 150 నిమిషాల్లో 150 ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు మూడు భాగాలుగా ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, టీచింగ్ మెథడాలజీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ పై పరీక్షలు అడుగుతారు. ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల చేస్తారు.
మార్చి 15 నుంచి పరీక్షలు
ఫిబ్రవరి 12వ తేదీ నుంచి డీఎస్సీ అప్లికేషన్ల స్వీకరణ మొదలుకానుంది. ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. మార్చి 5 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్స్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31న పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 1న కీలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ 2న తుది కీ విడుదల చేస్తారు. డీఎస్సీ ఫలితాలను ఏప్రిల్ 7న ప్రకటిస్తారు. ఇతర రాష్ట్రాల్లోని ఏపీకి చెందిన వారి కోసం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అభ్యర్థులు నోటిఫికేషన్ ఇతర వివరాల కోసం https://cse.ap.gov.in/loginhome వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఏపీ టెట్ షెడ్యూల్
టెట్ పరీక్ష షెడ్యూల్ ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి టెట్ అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 18 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఫీజు చెల్లించేందుకు ఫిబ్రవరి 17 చివరి తేదీ. ఈ నెల 19వ తేదీన అభ్యర్థులు మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 23 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు. టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు. మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు. టెట్, డీఎస్సీ రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు.
సంబంధిత కథనం