AP DSC Posts : ఏపీ డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం, జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే!
AP DSC Posts : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 22 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP DSC Posts : ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్(AP DSC) విడుదలైంది. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో డీఎస్సీ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 సిలబస్ ప్రకారం డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ కు 20 శాతం, డీఎస్సీకి 80 శాతం వెయిటేజీ ఉంటుంది. పూర్తి వివరాలకు డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ apdsc.apcfss.in ను చెక్ చేయండి. అభ్యర్థుల సందేహాలకు హెల్ప్ డెస్క్ నెంబర్లు 9505619127, 9705655349 ఏర్పాటు చేశారు. మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2299, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 పోస్టులు ఉన్నాయి.
డీఎస్సీ ముఖ్య తేదీలు
- ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరణ
- మార్చి 15 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు
- మార్చి 31న ప్రాథమిక కీ విడుదల
- ఏప్రిల్ 1న కీపై అభ్యంతరాల స్వీకరణ
- ఏప్రిల్ 2న తుది కీ విడుదల
- ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల
ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు
- శ్రీకాకుళం - ఎస్జీటీ-104, స్కూల్ అసిస్టెంట్-130, టీజీటీ-49
- విజయనగరం- ఎస్జీటీ-103, స్కూల్ అసిస్టెంట్-97, టీజీటీ-84
- విశాఖపట్నం-ఎస్జీటీ-101, స్కూల్ అసిస్టెంట్-133, టీజీటీ-95
- తూర్పుగోదావరి -ఎస్జీటీ-108, స్కూల్ అసిస్టెంట్-182, టీజీటీ-102
- పశ్చిమగోదావరి-ఎస్జీటీ-102, స్కూల్ అసిస్టెంట్-145, టీజీటీ-59
- కృష్ణా -ఎస్జీటీ-103, స్కూల్ అసిస్టెంట్-111, టీజీటీ-65
- గుంటూరు- ఎస్జీటీ-109, స్కూల్ అసిస్టెంట్-170, టీజీటీ-137
- ప్రకాశం-ఎస్జీటీ-111, స్కూల్ అసిస్టెంట్-299, టీజీటీ-93
- నెల్లూరు- ఎస్జీటీ-104, స్కూల్ అసిస్టెంట్-140, టీజీటీ-102
- కర్నూలు- ఎస్జీటీ-1022, స్కూల్ అసిస్టెంట్-550, టీజీటీ-121
- చిత్తూరు- ఎస్జీటీ-101, స్కూల్ అసిస్టెంట్-97, టీజీటీ-139
- అనంతపురం- ఎస్జీటీ-107, స్కూల్ అసిస్టెంట్-164, టీజీటీ-115
- కడప- ఎస్జీటీ-105, స్కూల్ అసిస్టెంట్-81, టీజీటీ-103
డీఎస్సీ సిలబస్ డౌన్ లోడ్
ఈసారి నిర్వహించే డీఎస్సీ పరీక్షక కోసం అన్ని సబ్జెక్టుల సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ విద్యాశాఖ. అభ్యర్థులు మొదటగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ Subjects & Syllabus అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీరు అలా క్లిక్ చేయగానే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో రెండు ఫైల్స్ ఉన్నాయి. SPECIAL DSC 2022 ALL SUBJECTS SYLLABUS అని ఒక ఫైల్ ఉండటంతో పాటు మరో ఫైల్ ఉంటుంది. ఇందులో రాత పరీక్ష విధానంతో పాటు అన్ని సబ్జెక్టుల సిలబస్ కూడా ఉంటుంది. వీటిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు
మార్చి 5వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు ఒక సెషన్‌లో ...మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరిచడానికి గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ రెండున ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెలువరిస్తారు. 2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పరిమితి ఉంటుంది.
సంబంధిత కథనం