తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Free Sand Policy : ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి, మార్గదర్శకాలు జారీ

AP Free Sand Policy : ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి, మార్గదర్శకాలు జారీ

08 July 2024, 15:40 IST

google News
    • AP Free Sand Policy : ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. పాత ఇసుక విధానాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి, ప్రభుత్వ జీవో జారీ
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి, ప్రభుత్వ జీవో జారీ

ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి, ప్రభుత్వ జీవో జారీ

AP Free Sand Policy : ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. 2019, 2021 ఇసుక విధానాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 2024 కొత్త ఇసుక విధానం రూపకల్పన వరకు ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉచిత ఇసుక సరఫరాపై ఏపీ సర్కార్ జీవో విడుదల చేసింది. కొత్త ఇసుక విధానం రూపొదించే వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. అప్పటి వరకు ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవో నంబర్ 43 జారీ చేసింది. అయితే వినియోగదారులు రవాణా ఖర్చులు, చట్టపరమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో నేటి నుుంచి ఉచిత ఇసుక పాలసీ అమలులోకి వస్తుండటంతో స్టాక్ పాయింట్స్ వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపించింది.

49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు

రాష్ట్రవ్యాప్తంగా పాదర్శకమైన ఉచిత ఇసుక సరఫరా విధానం నేటి నుంచి అమలులోకి వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు జీవో కాపీలను ఏపీ సీఎంవో ట్విట్టర్ లో పోస్టు చేశారు. సోమవారం కొన్ని జిల్లాల్లో స్టాక్‌ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు వేర్వేరు స్టాక్‌ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. స్టాక్‌ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాకు ఇంకా అధికారిక ఉత్తర్వులు జారీ లేదని అధికారులు అంటున్నారు. వీటిపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కలెక్టర్ ఛైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్పీ, జేసీ, పలు స్థాయిల అధికారులు అంటారు. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీల బాధ్యతను జిల్లా కమిటీలకు అప్పగించారు.

ఏపీ అభివృద్ధికి ఉచిత ఇసుక విధానం తొలిమెట్టు - టీడీపీ

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ స్వలాభం కోసం సిమెంటు, ఇసుక ధరలు విపరీతంగా పెంచడం వల్ల నిర్మాణరంగం కుదేలైందని టీడీపీ స్పష్టం చేసింది. గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుందని ట్వీట్ చేసింది. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి తొలి మెట్టు ఉచిత ఇసుక విధానం అని తెలిపింది. పేద బడుగు బలహీన వర్గాలు దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారి సొంత ఇంటి కల నెరవేరటానికి అతి ముఖ్యమైన ఇసుక ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. దీంతో భవన నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. పేద, మధ్యతరగతి వారి సొంత ఇంటి కల నెరవేరుతుందని టీడీపీ స్పష్టం చేసింది. అయితే భవన నిర్మాణ రంగానికి సంబంధించి అనుయాయ రంగాలు కూడా ఆర్థికంగా పుంజుకుంటాయని పేర్కొంది. భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ సామాగ్రి రవాణా కార్మికులు , సిమెంటు, స్టీలు వ్యాపారస్తులు, కలప వ్యాపారస్తులు, వడ్రంగి కార్మికులు, ఎలక్ట్రికల్ సామాగ్రి వ్యాపారస్తులు, ఎలక్ట్రీషియన్స్, పెయింట్స్ వ్యాపారస్తులు, పెయింటర్స్, టైల్స్ వ్యాపారస్తులు, టైల్స్, లేయింగ్ కార్మికులు, ప్లంబింగ్ కార్మికులు ఇకపై ఆర్థికంగా పుంజుకుంటారని టీడీపీ అభిప్రాయపడింది. గత ఐదు సంవత్సరాలుగా ఆర్థికంగా స్తంభించిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు తొలిమెట్టు ఉచిత ఇసుక అని ప్రకటించింది.

తదుపరి వ్యాసం