బాలికపై లైంగిక వేధింపులు...! వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్-kodumur ycp ex mla jaradoddi sudhakar arrested for sexual harassment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  బాలికపై లైంగిక వేధింపులు...! వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

బాలికపై లైంగిక వేధింపులు...! వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 04, 2024 08:03 PM IST

Ex MLA Jaradoddi Sudhakar Arrest:బాలికతో అసభ్య ప్రవర్తించిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కొద్దిరోజుల కిందట వీడియోలు కూడా బయటికి వచ్చాయి.

మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ (image source unsplash.com)

బాలికతో అసభ్యకరంగా వేధించిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయమే అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేశారు.

కోడుమూరు నియోజకవర్గం నుంచి జరదొడ్డి సుధాకర్ 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తన ఇంట్లో పని చేసే బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు ఎన్నికల సమయంలో బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో సుధాకర్‌ తీరుపై అప్పట్లోనే మహిళా సంఘాలు మండిపడ్డాయి. విచారణ జరిపించిన అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు బలంగా వినిపించాయి.

ఈ ఘటనపై ఇటీవలే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన్ను అరెస్ట్ చేశారు. ముందుగా ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేశారు.కోడుమూరు నియోజకవర్గంలో జరదొడ్డి సుధాకర్‌ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది.

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన సుధాకర్… టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామంజనేయులుపై 36,045 ఓట్ల తేడాతో గెలిచారు. అభ్యర్థుల మార్పుపై కసరత్తు చేసిన వైసీపీ అధినాయకత్వం… ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు నుంచి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఆదిమూలపు సతీశ్ కు అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికలో టీడీపీ తరపున పోటీ చేసిన బొగ్గుల దస్తగిరి 21,583 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

WhatsApp channel