Munugode Bypoll : మునుగోడు బరిలో ఇద్దరు కోమటిరెడ్డిలు.. ముగ్గురు పాల్వాయిలు
Munugode By Election : మునుగోడు ఉప పోరు దగ్గరపడుతుంది. ప్రధాన పార్టీలు పూర్తిగా ఫోకస్ చేస్తున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. అయితే తాజా విషయం ఏంటంటే.. మునుగోడు బరిలో ఇద్దరు కోమటిరెడ్డిలు, ముగ్గురు పాల్వాయిలు ఉన్నాయి.
ఎన్నికల్లో కొన్ని జిమ్మిక్కులు కనిపిస్తుంటాయి. ఒకే పేరుతో ఉన్న వాళ్లు బరిలో నింపడం ప్రత్యర్థి పార్టీలు చేస్తుంటాయి. ఎంతకొంత ప్రభావం చూపక పోతారా అని ఆశ. కొన్ని ఓట్లైనా.. అటు ఇటు కాకపోతాయా అనే ప్లాన్ తో జిమ్మిక్కులు చేస్తాయి. మునుగోడు(Munugode)లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. అయితే మా ఇష్టంతోనే పోటీలో ఉన్నామని అభ్యర్థులు చెబుతున్నారు. ఊహించుకునేవాళ్లు ఊహించుకుంటున్నారు. మునుగోడు బైపోల్(Munugode Bypoll) బరిలో ఇద్దరు కోమటిరెడ్డిలు, ముగ్గురు పాల్వాయిలు ఉన్నారు.
ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatirreddy Rajagopalreddy) నవంబర్ 3 తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అయితే కోమటిరెడ్డి సాయి తేజా రెడ్డిని అనే వ్యక్తి కూడా ఈ ఎన్నిక బరిలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi), బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ క్యాండిడెట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(kusukuntla Prabhakar Reddy) నుండి గట్టి సవాలును ఎదుర్కొంటున్నారు. మరోవైపు పాల్వాయి ఇంటిపేరుతో మరో ఇద్దరు బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల్లో అధికార టీఆర్‌ఎస్(TRS)కు చెందిన ప్రభాకర్ రెడ్డికి మాత్రమే తన పేరుతో వచ్చి నామిమేషన్ వేసిన వాళ్లు కనిపించలేదు.
కోమటిరెడ్డి సాయితేజా రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి దూరపు బంధుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. వృత్తిరీత్యా వైద్యుడు కోమటిరెడ్డి సాయి తేజా రెడ్డి. ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న పోటీలు ఉన్నానని చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జూనియర్ కోమటిరెడ్డి విషయంలో రాజ్‌గోపాల్‌రెడ్డి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. సాయి తేజకు తన గెలుపుపై ఎలాంటి భ్రమలు లేవు. ఇది గెలవడం కోసం కాదని, కేసీఆర్ ఓడిపోవాలని పోరాటం అని సాయితేజా స్నేహితులు చెబుతున్నారు.
కాగా, కాంగ్రెస్(Congress) అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మరో ఇద్దరు పాల్వాయిలు పోటీ పడుతున్నారు. మొదటి వ్యక్తి పాల్వాయి వేణు, తన నామినేషన్ పత్రాలలో తనను తాను సామాజిక కార్యకర్త(Social Activist)గా చెప్పారు. సూర్యాపేట జిల్లా వాసిగా పేర్కొన్నాడు. మునుగోడు ఉపఎన్నికకు తనను సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో రెండో పాల్వాయి ములుగు జిల్లాకు చెందిన పాల్వాయి లక్ష్మీనారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ(AAp) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.