TS EAPCET Hall Tickets : టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-ts eapcet 2024 agriculture pharmacy hall tickets released engineering admit cards from may 1st 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eapcet Hall Tickets : టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

TS EAPCET Hall Tickets : టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Apr 29, 2024 04:52 PM IST

TS EAPCET Hall Tickets : తెలంగాణ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు కౌన్సిల్ వెబ్ సైట్ లో అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు మే 1 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.

టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల
టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల

TS EAPCET Hall Tickets : తెలంగాణ ఈఏపీసెట్(TS EAPCET 2024) అగ్రికల్చర్, ఫార్శసీ హాల్ టికెట్లు(Hall Tickets) విడుదలయ్యాయి. ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థుల హాల్ టికెట్లను ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్ అభ్యర్థులకు మే 1 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నారు.

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS EAPCET 2024) నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు హాల్ టిక్కెట్లు(TS EAPCET Hall Tickets) లేదా అడ్మిట్ కార్డులను ఇవాళ విడుదల చేసింది. అగ్రికల్టర్, ఫార్మసీ అభ్యర్థులు కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in/ నుంచి అడ్మిట్ కార్డులను(Admit Cards) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈఏపీ సెట్ కు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ అభ్యర్థులు రూ. 5,000 ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు మే 9, 10 , 11 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ అభ్యర్థులకు మే 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ను జెఎన్టీయూ(JNTU Hyderabad), హైదరాబాద్ నిర్వహిస్తుంది. 2024-2025 విద్యాసంవత్సరానికి తెలంగాణలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈఏపీసెట్ 2024 నిర్వహిస్తారు.

ఈఏపీసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ ఎలా?(TS EAPCET 2024 Hall Tickets Download)

Step 1 : కౌన్సిల్ వెబ్‌సైట్‌ https://eapcet.tsche.ac.in/ ను సందర్శించండి

Step 2 : EAPCET 2024 హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3 : అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెం, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెం, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేశాలి.

Step 4 : Get Hall Ticket ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

టాటూలు, గోరింటాకు వద్దు

టీఎస్ ఈఏపీసెట్‌(TS EAPCET-2024)కు ఈ ఏడాది 3.54 లక్షల మందికి పైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మే 7 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మంచనీళ్ల బాటిళ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. చేతులకు గోరింటాకు, టాటూలు పెట్టుకోవద్దని సూచించారు. 1.30 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ స్ట్రీమ్(Engneering Stream) కు 2,54,543 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఈఏపీసెట్‌ కన్వీనర్‌ డీన్ కుమార్ పేర్కొన్నారు. 21 జోన్లలో ఈఏపీ సెట్ నిర్వహిస్తున్నట్లు.. వీటిలో తెలంగాణలో 16, ఏపీలో 5 జోన్లు ఉన్నాయని ప్రకటించారు. అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలకు 135 కేంద్రాలు, ఇంజినీరింగ్‌ పరీక్షకు 166 కేంద్రాలు ఉన్నాయన్నారు. నోటిఫికేషన్‌ (TS EAPCET Notification)ఇచ్చే సమయానికి విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు పూర్తి కాలేదని, అందువల్ల ఈ ఏడాదీ ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

సంబంధిత కథనం