Telangana News Live October 14, 2024: TG Mlc Elections : ఊపందుకుంటున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థిని ప్రకటించిన యూటీఎఫ్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 14 Oct 202404:34 PM IST
TG Mlc Elections : నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించింది. నవంబర్ 6వ తేదీ నాటికి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ముగుస్తుంది.
Mon, 14 Oct 202401:07 PM IST
Bhadradri Police Deaths : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస పోలీస్ సూసైడ్ లు కలకలం రేపుతున్నాయి. వంద రోజుల వ్యవధిలో ఒక ఎస్సైతో పాటు పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. పని ఒత్తిడి, ఆఫీసర్లు, సిబ్బంది మధ్య కో ఆర్డినేషన్, ఆర్థిక ఇబ్బందులు పలు కారణాలతో పోలీసులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
Mon, 14 Oct 202411:01 AM IST
- TGSRTC : స్పెషల్ ఛార్జీల పేరుతో పండగపూట ఆర్టీసీ టికెట్ల ధరలు పెంచారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ స్పెషల్ ఛార్జీలపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో.. సంస్థ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. స్పెషల్ ఛార్జీలపై వివరణ ఇచ్చారు. రెగ్యులర్ సర్వీసుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు.
Mon, 14 Oct 202410:02 AM IST
- Group 1 Mains Hall Tickets : టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://hallticket.tspsc.gov.in లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ లింక్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Mon, 14 Oct 202408:28 AM IST
- Jagtial : ఫారెస్ట్ ఆఫీసులో పార్టీ చేసుకున్న ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారిని సస్పెండ్ చేశారు. ఈ ఇష్యూపై విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యాక మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది. ఈనెల 11న ఫారెస్ట్ ఆఫీసులో పార్టీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Mon, 14 Oct 202407:44 AM IST
- Dasara 2024 : తెలంగాణలో దసరా పెద్ద పండగ. విజయదశమి రోజున ఎక్కడైనా జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. కానీ.. మహబూబాబాద్ జిల్లా గార్లలో మాత్రం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అందుకు ఓ బలమైన కారణం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏంటా కారణం.. ఓసారి చూద్దాం.
Mon, 14 Oct 202406:20 AM IST
- TGPSC Group 1 Mains 2024 : టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Mon, 14 Oct 202405:18 AM IST
- Telangana Liquor : పండగ పూట బీరు కొంటే.. అందులో చెత్త వచ్చిందని మందుబాబులు ఆందోళనకు దిగారు. వైన్ షాపు నిర్వాహకులను అడిగితే.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగింది.
Mon, 14 Oct 202404:49 AM IST
- Peddapally Murder: పెళ్లై ఇద్దరు పిల్లలున్న యువతి చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు బలైపోగా మరో ఇద్దరు జైలు పాలయ్యారు. కట్టుకున్న భర్త, సోదరుడు హంతకులుగా జైలు పాలైతే ప్రేమించిన వాడు ప్రాణాలు కోల్పోయాడు. చివరకు ఆ యువతి కూడా గుంటూరులో ఆత్మహత్యకు పాల్పడింది.
Mon, 14 Oct 202404:26 AM IST
- Warangal : పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఫ్లెక్సీల విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. పోలీస్ స్టేషన్ల వరకూ వెళ్లింది. ఆఖరికి వరంగల్ సీపీ జోక్యంతో సద్దుమణిగింది.
Mon, 14 Oct 202404:11 AM IST
- Bastar Encounter: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బస్తర్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది.అక్టోబర్ 4వ తేదీన చత్తీస్ గడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా గోవాడి, బొండోస్-తులాతులి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 35మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో 17మందిని పట్టుకుని చంపేశారని మావోయిస్టులు ప్రకటించారు.
Mon, 14 Oct 202403:44 AM IST
- Sarurnagar Murder: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భార్య చుడీదార్ వేసుకోవడం సహించని భర్త ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో భర్తే భార్యను హతమార్చినట్టు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు.