TGPSC Group 1 Mains 2024 : నేడు గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి-download tgpsc group 1 mains hall tickets from this website ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 Mains 2024 : నేడు గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

TGPSC Group 1 Mains 2024 : నేడు గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

Basani Shiva Kumar HT Telugu
Oct 14, 2024 11:50 AM IST

TGPSC Group 1 Mains 2024 : టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవాళ అందుబాటులోకి రానున్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు.

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్‌లో ఆరు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్‌లో భాగంగా ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతీ పేపర్‌ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

పరీక్షల షెడ్యూల్ ఇలా..

జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21, 2024.

పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.

పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23, 2024.

పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24, 2024.

పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25, 2024.

పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26, 2024.

పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27, 2024.

గ్రూప్-1 మెయిన్స్‌కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి.

మెయిన్స్ పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది. అభ్యర్థులకు అవగాహన కోసం వెబ్ సైట్ లో మోడల్ ఆన్సర్ బుక్ లెట్లను కూడా అందుబాటులో ఉంచింది.

Whats_app_banner