తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live October 1, 2024: Farm Oil crop : తెలంగాణ పామ్ ఆయిల్ రైతులకు దసరా కానుక, రూ. 17043 కు పెరిగిన గెలల ధర
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 01 Oct 202405:10 PM IST
Telangana News Live: Farm Oil crop : తెలంగాణ పామ్ ఆయిల్ రైతులకు దసరా కానుక, రూ. 17043 కు పెరిగిన గెలల ధర
- Farm Oil crop : పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచడంతో తెలంగాణలో పామాయిల్ రైతుల పంట పండింది. పామాయిల్ గెలల ధర అమాంతం రూ. 2651 వేలు పెరిగి రూ.17 వేలకు చేరింది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.
Tue, 01 Oct 202404:53 PM IST
Telangana News Live: Sangareddy News : ఐదేళ్ల బాలిక హత్య కేసు- దంపతులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష
- Sangareddy News : ఐదేళ్ల బాలికను పనిలో పెట్టుకుని వేధించి హత్య చేసిన హెడ్ కానిస్టేబుల్, అతని భార్యకు ఫ్యామిలీ కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. 2015 లో జరిగిన ఈ ఘటనపై సుదీర్ఘ వాదనలు అనంతరం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Tue, 01 Oct 202412:05 PM IST
Telangana News Live: Hyderabad : వారి గూడుని కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో
- Hyderabad : హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ కూల్చివేతలపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. తాజాగా కేటీఆర్ ఓ ఎమోషనల్ వీడియోను పోస్టు చేశారు. ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు. పేద పిల్లల పట్ల కనికరం లేదా అని కేటీఆర్ వీడియోకు నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.
Tue, 01 Oct 202409:21 AM IST
Telangana News Live: TG Women Commission : జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది, శ్రీ చైతన్య కాలేజీలో పరిస్థితులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సీరియస్
- TG Women Commission : మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ లో పరిస్థితులు సరిగ్గా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ లో అపరిశుభ్రతపై సీరియస్ అయ్యారు.
Tue, 01 Oct 202407:52 AM IST
Telangana News Live: Musi Row : ముషీరాబాద్‌లో ఉద్రిక్తత.. కేటీఆర్ కారుపై దాడి!
- Musi Row : హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముషీరాబాద్‌లో కేటీఆర్ కారుపై దాడి జరిగింది. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. కేటీఆర్ కారుపైకి ఎక్కారు. పోలీసులు వారిని లాక్కెళ్లారు.
Tue, 01 Oct 202407:32 AM IST
Telangana News Live: Siricilla School Bus: చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు..బతుకమ్మ వేడుకలకని వెళ్ళి తిరిగిరాని చిన్నారి
- Siricilla School Bus: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సు చిన్నారిని చిదిమేసింది.జ్వరంతో వారం రోజుల పాటు స్కూల్‌కు వెళ్ళని చిన్నారి,స్కూల్ లో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని ఉత్సాహంతో బడికి వెళ్ళింది.డ్రైవర్ నిర్లక్ష్యంతో మృతి చెందడంతో పేరెంట్స్‌కు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది.
Tue, 01 Oct 202407:02 AM IST
Telangana News Live: Nalgonda Mlc Elections: ఎన్నికల కోసం సిద్ధమవుతున్న టీచర్లు, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కమిషన్
- Nalgonda Mlc Elections: టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో నవంబర్ 6వ తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు.
Tue, 01 Oct 202405:53 AM IST
Telangana News Live: UAE Jobs : టామ్‌కామ్ నుంచి కీలక ప్రకటన.. యూఏఈలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
- UAE Jobs : డెలివరీ బాయ్స్ జాబ్స్‌కు యూఏఈలో డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం ఆ దేశంలో డెలివరీ బాయ్స్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. టామ్‌కామ్ కీలక ప్రకటన చేసింది. ఈ ఉద్యోగాలకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ సూచించింది.
Tue, 01 Oct 202405:13 AM IST
Telangana News Live: Rythu Runa Mafi : పురుగుల మందే పెరుగన్నం అయ్యింది.. రుణమాఫీ కాలేదని.. మరో రైతు ఆత్మహత్య
- Rythu Runa Mafi : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై ఆ రైతు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అప్పలన్నీ తీర్చేసి.. సంతోషంగా వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాడు. కానీ.. రుణమాఫీ కాలేదు. అటు బ్యాంకులు, ఇటు సహకార సంఘాలు, మరోవైపు అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారు. దీంతో ఆ అన్నదాత తనువు చాలించాడు.
Tue, 01 Oct 202403:51 AM IST
Telangana News Live: Khammam Ganja: ఖమ్మం కమిషనరేట్లో పట్టుబడిన 624 కిలోల గంజాయి దహనం
- Khammam Ganja: ఖమ్మం కమిషనరేట్లో తొలిసారి గంజాయిని దహనం చేశారు. పక్కనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడిన నిషేధిత గంజాయిని ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉండగా పూర్తిగా మైదాన ప్రాంతమైన ఖమ్మంలో మాత్రం గంజాయి పట్టుబడిన సంఘటనలు చాలా తక్కువగానే ఉంటాయి.
Tue, 01 Oct 202412:59 AM IST
Telangana News Live: US Visa Slots: రెండున్నర లక్షల వీసా స్లాట్ల విడుదల, ఈ ఏడాది అమెరికా ఆశావహులకు పండగే.. యూఎస్ కీలక నిర్ణయం
- US Visa Slots: విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వారికి ఢిల్లీలోని యూఎస్ కాన్సులేట్ తీపి కబురు చెప్పింది.ఇటీవల ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ ఏడాది భారతీయుల కోసం రెండున్నర లక్షల వీసా స్లాట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దేశంలోని నాలుగు రాయబార కార్యాలయాల్లో స్లాట్లు ఉంటాయి.
Tue, 01 Oct 202412:07 AM IST
Telangana News Live: Congress Ministers: ప్యూడల్ భావజాలంతో బీఆర్ఎస్ మహిళలను అవమానిస్తోంది.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Congress Ministers: బీఆర్ఎస్ నేతలు దుర్మార్గమైన ఫ్యూడల్ భావజాలంతో మహిళలను అత్యంత అవమానకరంగా చిత్రీకరిస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మార్పింగ్ ఫోటోలతో ట్రోల్ చేస్తూ వేయ్యేళ్ళు వెనకకు నెట్టి మళ్లీ దొరతనమే ముందుండాలని దుష్ట సాంప్రదాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.