TG Women Commission : జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది, శ్రీ చైతన్య కాలేజీలో పరిస్థితులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సీరియస్-madhapur women commission visited sri chaitanya college hostel series on staff ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Women Commission : జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది, శ్రీ చైతన్య కాలేజీలో పరిస్థితులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సీరియస్

TG Women Commission : జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది, శ్రీ చైతన్య కాలేజీలో పరిస్థితులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సీరియస్

Bandaru Satyaprasad HT Telugu
Oct 01, 2024 02:53 PM IST

TG Women Commission : మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ లో పరిస్థితులు సరిగ్గా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ లో అపరిశుభ్రతపై సీరియస్ అయ్యారు.

జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది, శ్రీ చైతన్య కాలేజీలో పరిస్థితులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సీరియస్
జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది, శ్రీ చైతన్య కాలేజీలో పరిస్థితులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సీరియస్

హైదరాబాద్ మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఇటీవల 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీలో వసతులు సరిగ్గా లేవని, కిచెన్ లో అపరిశుభ్రతపై ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. మంగళవారం మాదాపూర్‌లోని శ్రీ చైతన్య మహిళా కాలేజీని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె నేరుగా కాలేజీకి వెళ్లి, విద్యార్థుల తరగతుల గది, హాస్టల్ ను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

శ్రీచైతన్య కాలేజీ, హాస్టల్ లో తనిఖీలు

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద....శ్రీచైతన్య కాలేజీ హాస్టల్, మెస్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ అపరిశుభ్రత ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో సౌకర్యాలు సరిగా లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని యాజమాన్యంపై నేరెళ్ల శారద సీరియస్ అయ్యారు. విద్యార్థినులకు ఏమైనా సమస్యలున్నా, యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమని సంప్రదించాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ భరోసా ఇచ్చారు. గతవారం నిర్మల్ జిల్లా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కాలేజీల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

గత కొన్ని రోజులుగా శ్రీచైతన్య మహిళా కాలేజీలో విద్యార్థినులకు సంబంధించిన సమస్యలను తన దృష్టికి రావడంతో...మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారద మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థినుల హాస్టళ్లు, మెస్ లను తనిఖీ చేసి నాసిరకమైన ఫుడ్, హాస్టల్ లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించారు. వసతులు సరిగ్గా లేవని కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. అదే విధంగా అక్కడి విద్యార్థిలతో కాసేపు మాట్లాడివారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీచైతన్య యాజమాన్యానికి సమన్లు పంపారు. పిల్లల భద్రత పై రాజీపడే ఎవ్వర్ని ఉపేక్షించేది లేదని సందర్భంగా తెలియచేశారు.

జైలులో ఉన్నట్లు అనిపిస్తోందని విద్యార్థులు వాపోతున్నారన్నారు. ఒక్క రూమ్ లోనూ కిటికీలు లేవని, గాలి-వెలుతురు లేకపోతే ఎలా అని హాస్టల్ సిబ్బందిపై మండిపడ్డారు. ఎక్కడా శుభ్రత లేదని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని సిబ్బందిపై సీరియస్ అయ్యారు.

ఇరుకు గదుల్లో వెంటిలేషన్ లేకుండా

కాలేజీ హాస్టల్‌, తరగతి గదులను పరిశీలించి కాలేజీ యాజమాన్యం తీరుపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ అసహనం వ్యక్తం చేశారు. భవనంపై నుంచి లీకేజీ నీరు కారుతూ భోజనంలో పడిందని విద్యార్థులు చెప్తే ఏంకాదు తినండని ఉచిత సలహా ఇస్తారా?, పశువులను పెట్టినట్లు ఇరుకు గదుల్లో ఎలాంటి వెంటిలేషన్‌ లేకుండా, వాటర్ లీకేజీ ఉన్న వాష్‌ రూమ్స్‌, గదుల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇరుకు గదుల్లో మీరైతే ఉంటారా? అని సిబ్బందిపై విరుచుకుపడ్డారు. 5 ఫ్లోర్ల భవనంలోని అన్ని రూమ్ లు ఇలాగే ఉందని ఆమె ప్రశ్నించారు. విద్యార్థినులతో పాటు సిబ్బందిని ఆరు నెలల పాటు ఈ హాస్టల్‌ రూమ్ లలో ఉంచితే అప్పుడు వారి ఇబ్బందులు తెలుస్తాయన్నారు.

సంబంధిత కథనం