TS Inter Exams 2024 : ఇంటర్ పరీక్షల వేళ ఒత్తిడికి గురవుతున్నారా..? ఈ సేవలను వినియోగించుకోండి
Tele-MANAS For Telangana Inter students: ఇంటర్ పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా టెలి మానస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవల వివరాలను వెల్లడించింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.
Tele-MANAS For Telangana Inter Students: పరీక్షల కాలం రావటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో ఒత్తిడిని భరించలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని... కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలన్న ఆలోచనతో ‘టెలి-మానస్’ (టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండర్ నెట్‌వర్కింగ్ అక్రాస్ ది స్టేట్స్)సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా విద్యార్థులకు సైకాలజిస్టులతో సేవలు అందిస్తోంది. ఇందుకు సంబంధించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
టోల్ ఫ్రీ నెంబర్ సేవలు….
ఇంటర్ పరీక్షలు, ఫలితాల నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు ‘టెలి-మానస్’కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించుకొవచ్చని సూచించింది. విద్యార్థులు 14416 లేదా 1800914416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని వెల్లడించింది. ఈ టెలి మానస్(Tele Mental Health Assistance and Networking Across States) ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడమేగాక మార్గదర్శనం చేయనున్నట్టు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. భయం, ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తారని... ఇవే కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్‌ల సేవలను 24 గంటల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని వివరించింది.
గతేడా నవంబరు నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు మొత్తం 475 మంది విద్యార్థులు టెలి మానస్ సేవలను వినియోగించుకున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇందులో 398 కాల్స్... ఒత్తిడి సమస్యలను అధిగమించే విషయంలో రాగా ఇతర అంశాలకు సంబంధించి 77 కాల్స్ వచ్చినట్లు పేర్కొంది.
తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(TS Inter Exams 2024) ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరుగుతాయి. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్(Inter Exams)
28-02-2024 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
01-03-2024 - ఇంగ్లీష్ పేపర్-I
04-03-2024 - మ్యాథమెటిక్స్ పేపర్-IA / బోటనీ పేపర్-I / పొలిటికల్ సైన్స్ పేపర్-I
06-03-2024 - మ్యాథమెటిక్స్ పేపర్-IB / జువాలజీ పేపర్-I / హిస్టరీ పేపర్-I
11-03-2024 - ఫిజిక్స్ పేపర్-I / ఎకనామిక్స్ పేపర్-I
13-03-2024 - కెమిస్ట్రీ పేపర్-I / కామర్స్ పేపర్-I
15-03-2024 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I / బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
18-03-2024 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-I / జియోగ్రఫీ పేపర్-I
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్
29-02-2024 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
02-03-2024 - ఇంగ్లీష్ పేపర్-II
05-03-2024 - గణితం పేపర్-IIA / బోటనీ పేపర్-II / పొలిటికల్ సైన్స్ పేపర్-II
07-03-2024 - మ్యాథమెటిక్స్ పేపర్-IIB / జువాలజీ పేపర్-II / హిస్టరీ పేపర్-II
12-03-2024 - ఫిజిక్స్ పేపర్-II / ఎకనామిక్స్ పేపర్-II
14-03-2024 - కెమిస్ట్రీ పేపర్-II / కామర్స్ పేపర్-II
16-03-2024 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II
19-03-2024 - మోడరన్ లాంగ్వేజ్ పేపర్-II / జియోగ్రఫీ పేపర్-II
సంబంధిత కథనం